TS Govt Scheme : తెలంగాణలో ఇక రూ.500కే గ్యాస్ సిలిండర్.. రూల్స్ ఇవే?

ఎల్పీజీ సబ్సిడీకి సంబంధించి సోషల్ మీడియాలో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. అర్హులైన వారంతా ఈకేవైసీ చేయించుకోకపోతే కొత్త ప్రభుత్వం ఇచ్చే రూ.500 ల గ్యాస్‌ సిలిండర్‌ రాదు అని ఎవరో ఫేక్ న్యూస్‌ ప్రచారం చేశారు. దీంతో చాలా మంది మహిళలు ఉదయం నుంచి గ్యాస్‌ ఏజెన్సీల వద్ద క్యూలు కట్టారు.

TS Govt Scheme : తెలంగాణలో ఇక రూ.500కే గ్యాస్ సిలిండర్.. రూల్స్ ఇవే?
New Update

Gas : తెలంగాణలో(Telangana) కాంగ్రెస్(Congress) జెండా ఎగరిన వెంటనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించారు.చెప్పినట్లు గానే డిసెంబర్‌ 9 నుంచి మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. ఈ క్రమంలోనే రూ. 500 లకే గ్యాస్‌ సిలిండర్‌ అని కూడా చెప్పారు.

ఈ పథకం లో అర్హులైన మహిళా లబ్దిదారలందరికీ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 500 కే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామని కాంగ్రెస్‌ ముందుగా పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన పనులు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో ఓ వదంతు రాష్ట్రం అంతా చక్కర్లు కొట్టేస్తుంది.

ఈ పథకం పొందాలంటే ఈకేవైసీ చేయించుకోవాలని, లేకపోతే సబ్సిడీ రాదనే వదంతు ఇప్పుడు రాష్ట్రం అంతా వ్యాపించింది. దీంతో దీని గురించి ఆందోళన చెందిన చాలా మంది మహిళలు తమ ఆధార్‌ కార్డులతో సహా తెల్లవారుజాము నుంచే గ్యాస్‌ ఏజెన్సీ ల ముందు క్యూ కట్టేశారు. కేంద్ర ఇంధనాలు, సహజ వనరుల మంత్రిత్వశాఖ మహిళలందరూ ఈకేవైసీ కానీ వారు వెంటనే చేయించుకోవాలని తెలిపింది.

అయితే ఈ ప్రకటనకు తెలంగాణలో సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌ కు ఎటువంటి సంబంధం లేదు. చాలా మంది సబ్సిడీ రావాలంటే ఈకేవైసీ చేయించుకోవాలనే దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. దీంతో ఈకేవైసీ పూర్తి కాకపోతే సబ్సిడీ రాదనుకుని ఉదయం నుంచి గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరిపోయారు. గ్యాస్‌ ఏజెన్సీల వారు కూడా అలాంటి రూల్‌ ఏమి లేదు...కేవలం కేవైసీ కానీ వారికి మాత్రమే కేవైసీ చేస్తున్నామని వివరించారు.

తెలంగాణ లో గ్యాస్‌ లబ్ధిదారులు ఈ విషయాన్ని అవగాహన చేసుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 960కి అటు.. ఇటుగా నడుస్తోంది. ప్రాంతం ప్రాతిపదికన ఈ ధరల్లో మార్పులు ఉండొచ్చు.సోషల్‌ మీడియాలో వదంతులు నమ్మొద్దన్న అధికారులు తెలిపారు.

Also read: భారీగా పెరిగిన వెల్లుల్లి ధరలు..కిలో ఎంతకు చేరిందంటే..!

#telangana #gas-agency #ts-congress-politics #ts-govt-scheme #ekyc
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe