ఖుషి టైటిల్‌ సాంగ్‌ కి ముహుర్తం కుదిరింది!

టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, సమంత నటిస్తున్న చిత్రం ఖుషి. ఈ చిత్రానికి శివనిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్‌ పోస్టర్లతో పాటు, సింగిల్‌ సాంగ్స్ కూడా సూపర్‌ రెస్పాన్స్ ని అందుకున్నాయి. నా రోజా నువ్వే సాంగ్ అయితే ఇప్పటికే మిలియన్ల వ్యూస్ రాబట్టి ట్రెండింగ్‌ లో నిలిచింది.

ఖుషి టైటిల్‌ సాంగ్‌ కి ముహుర్తం కుదిరింది!
New Update

టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, సమంత నటిస్తున్న చిత్రం ఖుషి. ఈ చిత్రానికి శివనిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్‌ పోస్టర్లతో పాటు, సింగిల్‌ సాంగ్స్ కూడా సూపర్‌ రెస్పాన్స్ ని అందుకున్నాయి. నా రోజా నువ్వే సాంగ్ అయితే ఇప్పటికే మిలియన్ల వ్యూస్ రాబట్టి ట్రెండింగ్‌ లో నిలిచింది.

kushi title song is out on this date

తాజాగా మేకర్స్‌ ఈ మూవీ నుంచి థర్డ్‌ సింగిల్ అప్‌డేట్‌ అందించారు. ఖుషి టైటిల్‌ సాంగ్‌ ను జులై 28న విడుదల చేస్తున్నట్టు తెలియజేశారు. బ్లూ డ్రెస్‌లో ఛిల్‌ అవుట్‌ మూడ్‌లో ఉన్న విజయ్ దేవరకొండ లుక్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ గా మారింది. . మ్యూజిక్‌ డైరెక్టర్‌ హేశమ్‌ అబ్ధుల్‌ వహబ్‌ టీం ఇప్పటికే ఖుషి నువ్‌ కనబడితే.. ఖుషి నీ మాట వినబడితే.. అంటూ సాగే ట్యూన్‌తో అదిరిపోయే మ్యూజికల్ అప్‌డేట్ అందించాడు. ఈ ట్యూన్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మ్యూజిక్ లవర్స్‌.

ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఖుషి చిత్రాన్ని సెప్టెంబర్ 1న సినిమా విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ లాంఛ్ చేసిన స్పెషల్ పోస్టర్‌ అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యానర్‌లో ఈ చిత్రంలో స‌చిన్ ఖ‌డేక‌ర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, ల‌క్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, కన్నడ యాక్టర్‌ జ‌య‌రాం, శ‌ర‌ణ్య ప్రదీప్‌ కీల‌క పాత్రలు పోషిస్తున్నారు.

#kushi-movie #samantha #vijayadevarakonda
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి