kurnool: కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసుల ఓవరాక్షన్ ఓ యువకుడి ప్రాణాలమీదకు తెచ్చింది. కూతురి ప్రేమ వ్యవహారం ఇష్టం లేని తల్లిదండ్రులు సాయికుమార్ అనే యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కౌన్సిలింగ్ పేరుతో ఆ యువకుడిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి బాగా చితకబాదారు. ఈ అవమానం భరించలేని ఆ యువకుడు మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం యువకుడి పరిస్ధితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభూత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కల్లుబావి వీధికి చెందిన యువతిని సాయికుమార్ ప్రేమించాడు. ఐ లవ్ యు అంటూ ఆ యువతికి ప్రపొజ్ చేశాడు. సాయికుమార్ నచ్చడంతో ఆ యువతి కూడా అతడి లవ్ కు ఓకే చెప్పింది. ఇద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఎట్టకేలకు వీరిద్దరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలిసింది. సాయికుమార్ తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకున్నారు. ఇద్దరికి పెళ్లి చేస్తే మంచిదని అనుకున్నారు. అయితే, ఈ ప్రేమ వ్యవహారం యువతి తల్లిదండ్రులకు నచ్చలేదు. వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలనే ఇన్టెన్షన్ తో ఉన్నారు. దీంతో ఎలాగైనా తమ కూతురికి అతడిని దూరం చేయాలనుకున్నారు.
సాయికుమార్ తమ కూతురి పై అత్యాచారయత్నం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో కౌన్సిలింగ్ పేరుతో ఆ యువకుడిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. సాయికుమార్ ను బాగా చితకబాదారు. పోలీసులు కొట్టడంతో మనస్తాపం చెందిన సాయికుమార్ ఈ అవమానం భరించలేకపోయాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన యువకుడి తల్లిదండ్రులు కర్నూలు ప్రభూత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్ధితి విషమంగా ఉంది. సాయికుమార్ తల్లిదండ్రులు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్‌కు పిలిపించి సాయికుమార్ ను చితకబాది అతడు ఆత్మహత్య చేసుకునే చేస్తారా అంటూ పోలీసులపై బాధితుడి తల్లిదండ్రులు మండిపడుతున్నారు.