Kubera : హైదరాబాద్ లో కుబేర షూటింగ్.. వీడియో లీక్, నెట్టింట వైరల్!

'కుబేర' మూవీ షూటింగ్ ని తాజాగా హైదరాబాద్ కి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ధనుష్‌, అక్కినేని నాగార్జున మధ్య వచ్చే యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది.. ఈ క్రమంలోనే షూటింగ్‌ లొకేషన్‌లో తీసిన ఓ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Kubera : హైదరాబాద్ లో కుబేర షూటింగ్.. వీడియో లీక్, నెట్టింట వైరల్!
New Update

Dhanush Kubera Movie Shooting Video Leak : కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కింగ్ నాగార్జున ఇందులో మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా ఉండబోతోంది. ఇందులో ధనుష్ స్లమ్ లో నివసించే కుర్రాడి పాత్ర పోషిస్తున్నాడు.

రీసెంట్ గానే ముంబై లో ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ షూటింగ్ ని తాజాగా హైదరాబాద్ కి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ధనుష్‌, అక్కినేని నాగార్జున మధ్య వచ్చే యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది.. ఈ క్రమంలోనే షూటింగ్‌ లొకేషన్‌లో తీసిన ఓ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Also Read : ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్.. రజినీకాంత్ సినిమాలో బాలయ్య!

రోప్‌ వేలతో షూట్‌ చేస్తున్నట్టు వీడియో ద్వారా అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఏషియన్‌ సినిమాస్‌ బ్యానర్‌పై సునీల్ నారంగ్‌, పీ రామ్‌మోహన్‌ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

#kubera-movie-shooting #dhanush #nagarjuna
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe