సిరిసిల్ల జిల్లా వేములవాడలో కేటీఆర్ పర్యటన

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చింతల్ ఠాణా గ్రామ శివారులో నిర్మించిన 42 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను జిల్లా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా నిరాశ్ర యులుగా ఉంటున్న కోతుల సంతతికి చెందిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను మంజూరు చేసిన కేటీఆర్‌.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

New Update
సిరిసిల్ల జిల్లా వేములవాడలో కేటీఆర్ పర్యటన

తెలంగాణ ఐటీ , మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో పర్యటించారు. పట్టణంలో 100 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కర్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యే రమేశ్‌ బాబు పాల్గొన్నారు. ఇందులో భాగంగా నేడు (మంగళవారం) ఉదయం 10 గంటలకు వేములవాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన నంది కమాన్ జంక్షన్‌ను మంత్రి ప్రారంభిచారు. అనంతరం చింతలతండా గ్రామపంచాయతీలో 42 డబల్ బెడ్‌రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఉదయం 11 గంటలకు జిల్లా దవాఖానలో డయాలసిస్ సెంటర్, డీఈఐసీ సెంటర్, మాతృసేవా కేంద్రాలను, హాస్పిటల్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప్లాంటును ప్రారంభిచారు. 11.30 గంటలకు మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సమీపంలో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని, మధ్యాహ్నం 12 గంటలకు మూల వాగు వద్ద అత్యాధునిక హంగులతో ఏర్పాటుచేసిన వాకింగ్ ట్రాక్‌ను, 12.30 గంటలకు శ్యామకుంట జంక్షన్ వద్ద కూరగాయల మార్కెట్‌ను ప్రారంభిచారు.

ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వేములవాడ ఏరియా ద‌వాఖాన సమీపంలో గోశాల ఆవరణలో రూ.31 లక్షలతో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప్లాంటును ప్రారంభించారు. మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సమీపంలో మిషన్ భగీరథ, మూల వాగు వద్ద అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్‌ను, శ్యామకుంట జంక్షన్ వద్ద కూరగాయల మార్కెట్‌ను ప్రారంభిచారు. బద్ది పోచమ్మ ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. భక్తుల సౌకర్యార్థం 100 గదుల కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేసి.. అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ బంధు పథకంలో భాగంగా 600 మందికి చెక్కులను మంత్రి కేటీఆర్‌ పంపిణీ చేయనున్నారు.

Advertisment
తాజా కథనాలు