KTR : అడ్డమైన థంబ్‌నెయిల్స్ పెడుతున్నారు.. ఆ యూట్యూబ్‌ ఛానెల్స్‌కు కేటీఆర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

తమపై అసత్య ప్రచారాలను ప్రచురించిన మీడియా సంస్థలపై న్యాయపరమైన చర్యలు ప్రారంభించామన్నారు కేటీఆర్. యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ఈ కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా థంబ్‌నెయిల్స్ పెడుతూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

New Update
KTR : అడ్డమైన థంబ్‌నెయిల్స్ పెడుతున్నారు.. ఆ యూట్యూబ్‌ ఛానెల్స్‌కు కేటీఆర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

Thumbnails : బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు(YouTube Channels) కొన్ని, ఏలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయన్నారు కేటీఆర్(KTR). ప్రజలను తప్పుదోవ పట్టించేలా తంబ్ నెయిల్స్(Thumbnails) పెడుతూ, వార్తల పేరుతో శుద్ద అబద్దాలను చూపిస్తున్నాయని మండిపడ్డారు. గుడ్డి వ్యతిరేకత వలనో లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇలాంటి నేరపూరితమైన, చట్టవిరుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్(Fake News) లను ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఇది వ్యక్తిగతంగా తనతోపాటు, తమ పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతున్నదని.. కేవలం ప్రజలను అయోమయానికి గురి చేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

Also Read : నా మీద జోకులు వేస్తావా? బాలికను నడిరోడ్డుపై కత్తితో పదేపదే పొడిచిన దుర్మార్గుడు!

KTR ఇంకా ఏమన్నారంటే..? 

"గతంలో మాపై అసత్య ప్రచారాలను, అవాస్తవాలను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించాము. ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ఈ దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాము. అసత్యాలను అదేపనిగా ప్రచారం చేసి, అడ్డమైన తంబునెల్స్ తో వార్తల పేరిట ప్రాపగండకు పాల్పడుతున్న యూట్యూబ్ ఛానళ్లపైన పరువు నష్టం కేసులు నమోదు చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాము. దీంతోపాటు ఆయా యూట్యూబ్ ఛానళ్లను నిషేధించాలని యూట్యూబ్ కి అధికారికంగా ఫిర్యాదు కూడా చేస్తాము. ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూనే, కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్దంగా ఉండాలని హెచ్చరిస్తున్నాము."

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు