సహకరించండి ప్లీజ్
ఢిల్లీ పర్యటన ముగించుకున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌కు వచ్చారు. ఎంపీ రంజిత్‌రెడ్డి, ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. అంతకుమునుపు. ఆయన ముగ్గురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. రక్షణ మంత్రి రాజ్‌నాత్‌సింగ్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్‌పురి, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు.
మరోసారికి భేటీ
హైదరాబాద్‌లోని రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే అంశంపై రాజ్‌నాథ్‌సింగ్‌తో కేటీఆర్ చర్చించారు. మెట్రో రెండో దశకు అనుమతి ఇవ్వాలని, నగరంలో స్కైవేలు, ఫ్లైఓవర్‌లు నిర్మించేందుకు సహకరించాలని హర్‌దీప్‌సింగ్ పురీని కోరారు. ఇక హోం మంత్రి అమిత్ షాతో ఖరారైన సమావేశం చివరి నిమిషంలో రద్దయిన విషయం తెలిసిందే.