KTR Challenged To CM Revanth Reddy : నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్న మోతీలాల్ ను అవమానించేలా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడారని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఉద్యోగాలు పొందిన రేవంత్ రెడ్డి అదే కోచింగ్ సెంటర్లను, వారిని అవమానించేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ రోజు కేటీఆర్ మాట్లాడుతూ.. మిమ్మల్ని గద్దెనెక్కించిన అదే యువత ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తోందన్నారు. 8 నెలల్లో ఇప్పటి దాకా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government), మిగిలిన నాలుగు నెలల్లో ఏవిధంగా రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. మిమ్మల్ని వదిలిపెట్టమని కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. క్షేత్రంలో నిలదీస్తామని.. విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి కొట్లాడుతామన్నారు.
ఇది రాజకీయ పార్టీల సమస్య కాదని.. లక్షలాది మంది యువతకు సంబంధించిన అంశమన్నారు. ఈ అంశంలో రేవంత్ రెడ్డి ఈగోకు పోకుండా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కండకావరం తో మాట్లాడడం రేవంత్ రెడ్డి ఇకనైనా ఆపాలన్నారు. రేవంత్ నిరుద్యోగులు విద్యార్థులపై చేసిన తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఏ పరీక్ష రాశారని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగులతో దీక్ష చేశారో చెప్పాలన్నారు.
అశోక్ నగర్ లోని విద్యార్థులను సన్నాసులు అంటున్న రేవంత్... మీరు సన్నాసులా? రాహుల్ గాంధీ సన్నాసులా? అనే విషయం చెప్పాలన్నారు. అశోక్ నగర్ లో.. యూనివర్సిటీలో పిల్లలను ఈడ్చుకుపోతున్న అంశం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి సత్తా, చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాలు, నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ పై శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. నిరుద్యోగులు అడుగుతున్న డిమాండ్లపై వెంటనే సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్నారు.
Also Read : మణిపూర్‌లో మరోసారి కాల్పులు.. జవాన్ మృతి