Kavitha Arrest: నా చెల్లిని అరెస్ట్ చేస్తారా?.. కేటీఆర్ ఆగ్రహం

లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కవిత ఇంటికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు చేరుకున్నారు. వారిని కవిత నివాసంలోని ఈడీ అధికారులు అనుమతించలేదు. దీంతో కవిత ఇంటి ముందు ధర్నాకు దిగారు కేటీఆర్.

New Update
Kavitha Arrest: నా చెల్లిని అరెస్ట్ చేస్తారా?.. కేటీఆర్ ఆగ్రహం

KTR Reaction on Kavitha Arrest: లిక్కర్ స్కాం కేసులో (Delhi Liquor Scam) ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కవిత ఇంటికి మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), హరీష్ రావులు (Harish Rao) చేరుకున్నారు. వారిని కవిత నివాసంలోని ఈడీ అధికారులు కొద్దిసేపటి వరకు అనుమతించలేదు. కార్యకర్తలు వారిని లోపలి అనుమతించాలని ఆందోళన చేయగా.. చివరికి కుటుంబ సభ్యులు కావడంతో వారిని లోపలి అనుమతించారు. కేటీఆర్, హరీష్ రావు వెంట మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు.

ఢిల్లీకి కవిత..

ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ (ED) అధికారులు.. ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు. కవితను ఢిల్లీ తరలించేందుకు ఈడీ అధికారులు ప్రత్యేక విమానాన్ని బుక్ చేసినట్లు సమాచారం. లిక్కర్ స్కాం కేసులో తదుపరి విచారణను ఢిల్లీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీ కవిత తో పాటు మరికొంత మంది బీఆర్ఎస్ నేతలకు ఈడీ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.

ఎలా అరెస్ట్ చేస్తారు.. ఈడీ అధికారులపై కేటీఆర్ సీరియస్

ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. కవిత ఇంట్లోకి వెళ్లిన కేటీఆర్ ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. సుప్రీం కోర్టులో కేసు ఉన్నప్పుడు తన చెల్లి (కవిత) ను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ప్రోసిజర్ ప్రకారంగానే అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు తెలపగా.. ట్రానిక్ అరెస్ట్ వారెంట్ లేకుండా కవితను ఢిల్లీకి ఎలా తీసుకెళ్తారని ఈడీ అధికారులను కేటీఆర్ నిలదీశారు. తమ వ్యయవాదిని ఎందుకు లోపలి అనుమతించలేదని ఫైర్ అయ్యారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు