నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ సర్కార్ కు కేఆర్ఎంబీ లేఖ.! నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ రాసింది. కుడి కాలవుకు నీటి విడుదల వెంటనే ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. సాగునీరు కావాలని ఏపీ ప్రభుత్వం తమను కోరలేదని లేఖలో పేర్కొంది. ఉద్రిక్తతలకు తెరదించాలని కేఆర్‌ఎంబీ హెచ్చరించింది. By Jyoshna Sappogula 01 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Krishna River Management Board: నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ రాసింది. కుడి కాలవుకు నీటి విడుదల వెంటనే ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. సాగునీరు కావాలని ఏపీ తమను కోరలేదని లేఖలో పేర్కొంది. ఉద్రిక్తతలకు తెరదించాలని కేఆర్‌ఎంబీ కోరింది. ఐదు వేల క్యూసెక్కులు విడుదల చేయడం సరికాదని సూచించింది. సాగర్‌ను ఆక్రమించారని తెలంగాణ అరోపించిందని కేఆర్ఎంబీ తెలిపింది. 2024 జనవరి, ఏప్రిల్ లో నీటిని విడుదల చేయాల్సి ఉందని..ఏపీకి మూడు విడతల్లో నీటి విడుదలకు నిర్ణయం తీసుకున్నామని కేఆర్‌ఎంబీ వెల్లడించింది. Also read: నాగార్జునసాగర్ దగ్గర కొనసాగుతున్న హైటెన్షన్..అసలు దీని వెనుక కథేంటి? ఇదిలా ఉండగా..తెలుగు రాష్ట్రాల మధ్య జల యుద్ధం మరింత ముదిరింది. నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏపీ పోలీసులపై కేసు నమోదు అయ్యింది. ఏపీ పోలీసులపై నాగార్జున సాగర్ విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్‌లో తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. A-1గా ఏపీ పోలీస్ ఫోర్స్‌ను పేర్కొంటూ.. తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా చొచ్చుకువచ్చారని ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, మాచర్ల రూరల్ సీఐ, ఇరిగేషన్ అధికారుల తోపాటు మరికొంతమందిపై నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. Also Read: 40% ఓట్లు వచ్చిన వారికి పవర్.. ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీ ఏది? అటు ఈ వివాదంపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. అసలీ వివాదం చంద్రబాబు హయాం నుంచే ఉందని, సాగర్ కుడి కాలువను కూడా తెలంగాణ ప్రభుత్వమే నిర్వహిస్తుండడం చట్టవిరుద్ధమని తెలిపారు. మా నీళ్లు మా రైతులకు విడుదల చేయాలంటే మేం తెలంగాణ అనుమతి తీసుకోవాలా? అని అంబటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగర్ పై ఏపీ పోలీసులు దండయాత్ర అని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు అసమర్థత వల్లే తెలంగాణ పోలీసులు ఏపీ భూభాగంలోకి వచ్చారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో తమ భూభాగంలోకి ఏపీ పోలీసులు వెళ్లారని, అది దండయాత్ర ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఏపీ హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని అంబటి విమర్శించారు. ఇది చాలా సున్నితమైన అంశం అని, గొడవలు అనవసరం అని హితవు పలికారు. #andhra-pradesh #telangana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి