Kriti Shetty: శర్వానంద్ సరసన కృతి శెట్టి

వరుస ఫ్లాపులతో కృతి శెట్టి జోరు తగ్గింది. బ్యాక్ టు బ్యాక్ కాల్షీట్లు ఇచ్చేంత బిజీగా లేదిప్పుడు. ఇంకా చెప్పాలంటే, ఆమె ఏ సినిమా చేస్తుందనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఎట్టకేలకు కృతిశెట్టి నుంచి కొత్త సినిమా అప్ డేట్ వచ్చింది. 

Kriti Shetty: శర్వానంద్ సరసన కృతి శెట్టి
New Update

వరుస ఫ్లాపులతో కృతి శెట్టి జోరు తగ్గింది. బ్యాక్ టు బ్యాక్ కాల్షీట్లు ఇచ్చేంత బిజీగా లేదిప్పుడు. ఇంకా చెప్పాలంటే, ఆమె ఏ సినిమా చేస్తుందనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఎట్టకేలకు కృతిశెట్టి నుంచి కొత్త సినిమా అప్ డేట్ వచ్చింది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, శర్వానంద్ హీరోగా ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. శర్వాకు కెరీర్ లో 35వ సినిమా ఇది. భలే మంచి రోజు, శమంతకమణి, దేవ్ దాస్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తోంది.

గురువారం, కృతి శెట్టి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ వీడియోలో కృతి శెట్టి అందంగా, క్యూట్ గా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఒక షెడ్యూల్ మినహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తయింది. అక్టోబర్ నుంచి ప్రచారం ప్రారంభిస్తారు.

ఖుషి సినిమా ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ చేస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నాడు. షూటింగ్ షెడ్యూల్స్ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఒకే ఒక జీవితం సినిమాతో ఈ ఏడాది సక్సెస్ అందుకున్నాడు శర్వానంద్. అదే ఊపులో పెళ్లి కూడా చేసుకున్నాడు. తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని శ్రీరామ్ ఆదిత్య సినిమాను స్టార్ట్ చేశాడు. నిజానికి ఈ మూవీ కంటే ముందు, అతడు ఓ సినిమా లాంఛ్ చేశాడు. కానీ దాన్ని పక్కనపెట్టి, శ్రీరామ్ ఆదిత్య చెప్పిన సబ్జెక్ట్ ను పట్టాలపైకి తీసుకొచ్చాడు.

#kriti-shetty #sharwanand #people-media #35th-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe