Kriti Shetty: శర్వానంద్ సరసన కృతి శెట్టి వరుస ఫ్లాపులతో కృతి శెట్టి జోరు తగ్గింది. బ్యాక్ టు బ్యాక్ కాల్షీట్లు ఇచ్చేంత బిజీగా లేదిప్పుడు. ఇంకా చెప్పాలంటే, ఆమె ఏ సినిమా చేస్తుందనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఎట్టకేలకు కృతిశెట్టి నుంచి కొత్త సినిమా అప్ డేట్ వచ్చింది. By Karthik 21 Sep 2023 in సినిమా New Update షేర్ చేయండి వరుస ఫ్లాపులతో కృతి శెట్టి జోరు తగ్గింది. బ్యాక్ టు బ్యాక్ కాల్షీట్లు ఇచ్చేంత బిజీగా లేదిప్పుడు. ఇంకా చెప్పాలంటే, ఆమె ఏ సినిమా చేస్తుందనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఎట్టకేలకు కృతిశెట్టి నుంచి కొత్త సినిమా అప్ డేట్ వచ్చింది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, శర్వానంద్ హీరోగా ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. శర్వాకు కెరీర్ లో 35వ సినిమా ఇది. భలే మంచి రోజు, శమంతకమణి, దేవ్ దాస్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తోంది. గురువారం, కృతి శెట్టి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ వీడియోలో కృతి శెట్టి అందంగా, క్యూట్ గా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఒక షెడ్యూల్ మినహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తయింది. అక్టోబర్ నుంచి ప్రచారం ప్రారంభిస్తారు. ఖుషి సినిమా ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ చేస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నాడు. షూటింగ్ షెడ్యూల్స్ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఒకే ఒక జీవితం సినిమాతో ఈ ఏడాది సక్సెస్ అందుకున్నాడు శర్వానంద్. అదే ఊపులో పెళ్లి కూడా చేసుకున్నాడు. తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని శ్రీరామ్ ఆదిత్య సినిమాను స్టార్ట్ చేశాడు. నిజానికి ఈ మూవీ కంటే ముందు, అతడు ఓ సినిమా లాంఛ్ చేశాడు. కానీ దాన్ని పక్కనపెట్టి, శ్రీరామ్ ఆదిత్య చెప్పిన సబ్జెక్ట్ ను పట్టాలపైకి తీసుకొచ్చాడు. #sharwanand #kriti-shetty #people-media #35th-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి