Krishna Mukunda Murari: మురారిని చంపేయాలని ప్లాన్.. కృష్ణకు షాకిచ్చిన ముకుంద..!

మురారిని లాకప్ డెత్ చేయించాలని ప్లాన్ చేస్తాడు ముకుంద తండ్రి శ్రీనివాస్. మరో వైపు ముకుంద మరణ వాంగ్మూలం చదివిన ఆదర్శ్ భార్య చావుకి మురారినే కారణమని పూర్తిగా నమ్మేస్తాడు. ఇలా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Krishna Mukunda Murari: మురారిని చంపేయాలని ప్లాన్.. కృష్ణకు షాకిచ్చిన ముకుంద..!

Krishna Mukunda Murari Serial: చనిపోయినట్లుగా నాటకం ఆడుతున్న ముకుంద.. తన చావుకి కృష్ణే కారణమని మరణ వాంగ్మూలం రాయించామని తండ్రి శ్రీనివాస్ కు చెప్తుంది. కానీ కృష్ణను అరెస్ట్ చేయించడం ఇష్టంలేని శ్రీనివాస్ ఆ పేపర్ లో ముకుంద చావుకు మురారినే కారణమని రాయిస్తాడు. దీంతో మురారిని అరెస్ట్ చేస్తారు పోలీసులు.

Krishna Mukunda Murari Serial
ఇటు ముకుంద మురారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఆమె తండ్రి శ్రీనివాస్ అక్కడికి రాగానే.. కృష్ణను అరెస్ట్ చేయించావా అని అడుగుతుంది ముకుంద. దీంతో అసలు నిజం బయట పెడతాడు శ్రీనివాస్. అరెస్ట్ చేయించింది కృష్ణను కాదు మురారిని అని చెప్తాడు. మరి కొద్దిసేపట్లో లాకప్ డెత్ అవుతాడు అని ముకుందకు షాకిస్తాడు. దీంతో ముకుంద టెన్షన్ పడుతుంది.

Krishna Mukunda Murari Serial
మరో వైపు కృష్ణ, రేవతి, మధు మురారిని ఎలాగైనా బయటకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ముకుంద చావుకు మురారినే కారణమని పూర్తిగా నమ్ముతున్న ఆదర్శ్ అతని పై ద్వేషం పెంచుకుంటాడు. మురారి జైలు లోని మగ్గిపోతాడు.. వాడు ఎప్పటికీ బయటకు రాడు అని మాట్లాడతాడు. దీంతో కృష్ణ కోపంగా ఆదర్శ్ పై చేయెత్తుతుంది.

Krishna Mukunda Murari Serial
మురారి గురించి అలా మాట్లాడడం తట్టుకోలేకపోయిన కృష్ణ ఆదర్శ్ కు వార్నింగ్ ఇస్తుంది. అయినా సరే కృష్ణ మాటాలు లెక్క చేయని ఆదర్శ్.. మురారి ముకుందను వాడుకొని వదిలేసాడు.. మోసం చేశాడు అని తప్పుగా మాట్లాడతాడు. దీంతో కృష్ణ కన్నీళ్లు పెట్టుకుంటుంది.

publive-image
ఆ తర్వాత మురారిని విడిపించాలని స్టేషన్ కు వెళ్తుంది కృష్ణ. కానీ అక్కడ మురారి కనిపించడు. దీంతో కృష్ణ తన భర్త ఎక్కడ అని పోలీసులను నిలదీస్తుంది. విచారణ కోసం వేరే స్టేషన్ తీసుకెళ్లారని చెప్తారు.

publive-image
భర్త కనిపించకపోవడంతో కృష్ణ డల్ గా ఇంటికి వస్తుంది. తను రాగానే మురారిని కలిసావా అని అడుగుతుంది రేవతి. ఏసీపీ సార్ ఎక్కడ ఉన్నాడో తెలియలేదు అత్తయ్య అని ఏడుస్తుంది కృష్ణ. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Also Read: Anchor Sreemukhi: స్టేజ్ పై హీరో చేసిన పనికి.. చెంపపగలగొట్టిన శ్రీముఖి.. వైరలవుతున్న వీడియో

Advertisment
తాజా కథనాలు