/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-13T154938.833-jpg.webp)
Krishna Mukunda Murari: భార్య ముకుంద వదిలేసి వెళ్లిపోవడంతో భాదతో ఇంట్లోనే మందు తాగడం మొదలు పెడతాడు ఆదర్శ్. ఇది చూసిన, రేవతి, ఆదర్శ్ మురారిని ఆపాలని ప్రయత్నిస్తారు. ఎంత చెప్పిన ఆదర్శ్ వినకపోవడంతో కోపంగా వెళ్ళిపోతుంటాడు మురారి. ఇంతలో అమెరికా నుంచి భవానీ దేవి ఫోన్ చేస్తుంది. /rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-13T150607.619-jpg.webp)
భవానీ దేవికి నిజం తెలిస్తే ఏమవుతుందో అని అందరు భయపడతారు. సుమలత ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. మరో వైపు ఆదర్శ్ తాను మాట్లాడతానని గొడవ చేస్తాడు. తాగిన మత్తులో ఆదర్శ్ ఏం వాగుతాడో అని భయపడిన మధు తాను నోరు మూసేస్తాడు. ఇక భవానీ దేవికి డౌట్ రాకుండా అంతా బాగానే ఉందని కవర్ చేస్తుంది సుమలత.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-13T150638.431-jpg.webp)
ముకుందను ఎలాగైనా తిరిగి ఇంటికి తీసుకురావాలని బయలుదేరుతారు కృష్ణ, మురారి. ముకుందను కొట్టి తప్పు చేశాను అని కృష్ణ బాధపడుతుంది. దీంతో మురారి ముకుంద ఎప్పటికీ మారదు.. కేవలం నీకోసం మాత్రమే తనను వెతకడానికి వచ్చాను అంతే అని చెప్తాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-13T155147.044-jpg.webp)
కృష్ణ, మురారి టీ తాగుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి.. ఎవరో ఒక అమ్మాయి ట్రైన్ కిందపడి చనిపోయిందని చెప్తాడు. దీంతో కృష్ణ లో భయం మొదలవుతుంది. అక్కడ చనిపోయింది ముకుందనేమో అని టెన్షన్ పడుతుంది. కానీ మురారి మాత్రం అలాంటిదేమీ జరగదని కృష్ణకు దైర్యం చెప్తాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-13T150708.313-jpg.webp)
ఇంట్లో అందరు తనను మోసం చేశారని మధుతో భాదపడుతూ ఉంటాడు ఆదర్శ్. ముకుంద మనసులో నేను లేనని ఇంట్లో అందిరికీ తెలుసు కానీ ఎవరూ నాకు చెప్పకుండా మోసం చేశారని చెప్పి గదిలోకి వెళ్ళిపోతాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-13T155039.450-jpg.webp)
ఆ తర్వాత గదిలోకి వెళ్లిన ఆదర్శ్ కబోర్డ్ లో మురారి, కృష్ణ ఫోటోలను చూసి కోపంతో రగిలిపోతాడు. వాటిని బయటకు తీసి కాల్చేస్తాడు. గదిలోకి వెళ్లిన ఏదైనా చేసుకుంటాడేమో అనే భయంతో అక్కడికి వచ్చిన రేవతి, మధు ఆ మంటలను చూసి షాకవుతారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ లో ముకుంద రైలు కిందపడి చనిపోయిందని న్యూస్ వస్తుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-13T150745.511-jpg.webp)
Also Read : Kiran Abbavaram: తన మొదటి సినిమా హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న కిరణ్ అబ్బవరం..!
Follow Us