Krishna Mukunda Murari: శోభనం గదిలో ముకుంద.. భర్త ఆదర్శ్ అంటే ఇష్టం లేదని చెప్పేస్తుంది. దీంతో ఆదర్శ్ భార్య చేతిలో మళ్ళీ మోసపోయానని కోపంతో రగిలిపోతాడు ఆదర్శ్. ఇంట్లో అందరినీ పిలిచి.. మురారి పై గట్టి గట్టిగా అరుస్తాడు.
మురారి ఆదర్శ్ తో మాట్లాడడానికి ట్రై చేసినప్పటికీ ఆదర్శ్ సీరియస్ అవుతాడు. ముకుంద నీకోసమే ఎదురు చూస్తుందని నీకు తెలియదా అని మురారిని ప్రశ్నిస్తాడు. దీంతో మురారి ఏం మాట్లాడలేకపోతాడు.
కోపంతో రగిలిపోతున్న ఆదర్శ్.. అక్కడ నా భార్య నీకోసం వెయిట్ చేస్తుంది వెళ్లి తనను సంతోషపెట్టు అని మురారి పై రెచ్చిపోతాడు. దీంతో మురారి ఆదర్శ్ చెంప పగలగొడతాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తాను అని ఆదర్శ్ పై కోప్పడతాడు. ఇవి నా మాటలు కాదు.. ముకుంద మాటలు అని బాధపడతాడు ఆదర్శ్.
ఆదర్శ్ మాటలు విని ఆశ్చర్యపోయిన రేవతి.. ఏంటీ నాన్న ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. దీంతో ఆదర్శ్.. అవును పిన్ని.. ఈ మాటలు ముకుంద చెప్పడం విని పిచ్చోడిని అయిపోయాను అని ఏడుస్తాడు. అన్ని మర్చిపోయి హాయిగా ఉంటున్న నన్ను.. మళ్ళీ తీసుకొచ్చి పిచ్చోడిని చేశారు. ముఖ్యంగా ఈ కృష్ణ .. ముకుంద మారిపోయింది అని చెప్పి నన్ను మోసం చేసింది అంటూ ఆమెను నిందిస్తాడు.
ముకుంద మనసులో ఏముందో తెలుసుకోవాలని నిర్ణయించుకున్న కృష్ణ.. అందరి ముందు తనను నిలదీస్తుంది. ఆదర్శ్ చెప్పింది నిజమేనా..? అని ప్రశ్నిస్తుంది. దీంతో ముకుంద ఆదర్శ్ చెప్పింది నిజమే.. మురారికి తప్పా నా జీవితంలో మరొకరికి స్థానం లేదు అంటూ అందరికీ షాకిస్తుంది.
ముకుంద మాటలకు కోపంతో రగిలిపోతున్న కృష్ణ .. భర్త ముందు ఇలా మాట్లాడడానికి సిగ్గుండాలి.. అసలు నువ్వు ఆడదానివేనా అని ముకుంద చెంప పగలగొడుతుంది. దీంతో ముకుంద.. ఆదర్శ్ కోసం నేను పరితపిస్తున్నాని మీకు ఎప్పుడైనా చెప్పనా..? శోభనానికి ముహూర్తం పెట్టేస్తే కాపురం చేస్తాను అనుకున్నావా..? ఎప్పటికైనా మురారితోనే నా జీవితం అని కృష్ణతో వాదిస్తుంది.
దీంతో అత్త రేవతి ముకుందకు సర్ది చెప్పాలని ట్రై చేస్తుంది. పెళ్ళైన తర్వాత ఎంత మంది ఆడపిల్లలు సర్దుకుపోవడం లేదు. అలాగే నువ్వు కూడా భర్తతో కలిసి ఉందని అని చెప్తుంది. ఇక ముకుంద మాత్రం అందరి లాంటి ఆడపిల్లను కాదు నేను.. మురారిని దక్కించుకోవడానికి ఏమైనా చేస్తాను అని పొగరుగా మాట్లాడుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.