Krishna Mukunda Murari Serial: ఎట్టకేలకు దొరికిన ఆదర్శ్.. ముకుందను భార్యగా అంగికరిస్తాడా?

కృష్ణ, మురారి ఎట్టకేలకు ఆదర్శ్ ఉన్న ప్రదేశానికి చేరుకుని తనని ఇంటికి రమ్మని పిలుస్తారు. రావడం ఇష్టం లేదని ఆదర్శ్ తేల్చి చెబుతాడు. అయినా కృష్ణ అతడిని కన్విన్స్ చేసేందుకు ట్రై చేస్తోంది. ముకుందను ఆదర్శ్ భార్యగా అంగికరిస్తాడా? లేదా? అనేది సస్పెన్స్.

New Update
Krishna Mukunda Murari Serial: ఎట్టకేలకు దొరికిన ఆదర్శ్.. ముకుందను భార్యగా అంగికరిస్తాడా?

Krishna Mukunda Murari Serial: మురారి, కృష్ణ ఇద్దరూ కలిసి మెహతా చెప్పిన ప్రదేశానికి వెళ్తారు. రోడ్డు మీద ఒక వ్యక్తి వెళ్తుంటే అతడిని ఆదర్శ్ గురించి అడుగడంతో ఆచూకీ తెలుస్తుంది. కొంతమంది పిల్లలకి ఆదర్శ్ కోచింగ్ ఇస్తూ ఉండగా మురారి, కృష్ణ అక్కడికి వెతుక్కుంటూ వెళ్తారు. చాలా సంవత్సరాల తర్వాత ఆదర్శ్ ని చూసేసరికి మురారి చాలా ఎమోషనల్ అవుతాడు.

Krishna Mukunda Murari Serialమురారిని గుర్తుపట్టని ఆదర్శ్

కానీ, ఆదర్శ్ మురారిని గుర్తుపట్టలేకపోతాడు. ఎందుకంటే మురారికి ఆక్సిడెంట్ అయి అతడికి రూపం మార్చినట్లు ఆదర్శ్ కు తెలియదు. ఎవరు మీరు అని మురారి వాళ్ళని ఆదర్శ్ అడుగుతాడు. దీంతో, కృష్ణ మురారి గతం గురించి చెబుతుంది. వెంటనే ఆదర్శ్ మురారి అని పిలిచి హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతాడు. వాళ్ళిద్దరినీ చూసిన కృష్ణ చాలా సంతోష పడుతుంది. మురారి కృష్ణని పరిచయం చేస్తాడు. తను నా భార్య, నా ఫ్రెండ్, నా ఫిలాసఫర్ అన్నింటికంటే పెద్ద తింగరి అని చెబుతాడు. తింగరా అంటే అవును చాలా అల్లరి చేస్తుందని అంటాడు.

publive-image

ఆదర్శ్ ఇంటికి వెళ్తాడా?

ముకుందని వీడు పెళ్లి చేసుకోలేదా? అని ఆదర్శ్ తన మనసులో తాను అనుకుంటాడు. గతంలో ముకుంద మురారికి కాల్ చేసి మాట్లాడిన మాటలను గుర్తు తెచ్చుకుంటాడు. తరువాత ఇంట్లో వాళ్లందరూ నీ కోసం ఎదురుచూస్తున్నారు. పెద్దత్తయ్య మాత్రమే కాకుండా ముఖ్యంగా ముకుంద నీకోసం ఎదురుచూస్తు ఉంటుంది. తనకి నిన్ను తీసుకొస్తామని మాట ఇచ్చామని చెబుతుంది. దీంతో ఆదర్శ్ షాక్ అవుతాడు.

publive-image

కన్విన్స్ చేస్తోన్న కృష్ణ

కృష్ణ మురారి ఎంతగా బ్రతిమాలడినా ఆదర్శ్ ఇంటికి వెళ్లేందుకు అంగీకరించడు. కానీ కృష్ణ ఏమో తనను కన్విన్స్ చేయాలని చూస్తుంది. మరోవైపు మురారి కూడా.. ఇప్పటికీ నీ మనసులో ముకుంద ఉందని అంటాడు. కానీ, ఆదర్శ్ లేదు అని గట్టిగా అరుస్తాడు. ముకుంద కోసం కాకపోతే అమ్మ కోసం రావడానికి ఏంటి అభ్యంతరమని కృష్ణ అడుగుతుంది.

publive-image
ప్లీజ్ నా వల్ల కాదు దయచేసి అర్థం చేసుకోండని ఆదర్శ్ ఎమోషనల్ గా అంటాడు. అయితే, కచ్చితంగా ఆదర్శ్ ను ఇంటికి తీసుకెళ్తారని..కానీ ముకుందని భార్యగా అంగీకరిస్తాడా? లేదా? అని ఉత్కంఠగా ఉందని సీరియల్ అభిమానులు అంటున్నారు.

Also Read: శ్వేత సూసైడ్.. భర్తను అలా చూసి తట్టుకోలేకపోయిన కావ్య నెక్ట్స్ ఏం చేయనుంది?

Advertisment
తాజా కథనాలు