Krishna Mukunda Murari: ప్రియుడి కోసం భర్తను వదిలేస్తున్న ముకుంద.. ముకుందకు బుద్ది చెప్పాలని కృష్ణ, మురారి ప్లాన్ ముకుంద అసలు రూపం తెలుసుకుంటుంది కృష్ణ. దీంతో తనకు బుద్ది చెప్పడానికి కృష్ణ, మురారి కలిసి ఏదో ఒక ప్లాన్ చేయాలని డిసైడ్ అవుతారు. మరో వైపు ఎలాగైనా మురారితో ఒకటవ్వాలనే ఆలోచనలో ఉంటుంది ముకుంద. ఇలా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. By Archana 29 Feb 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Krishna Mukunda Murari: ముకుంద చేస్తున్న ఆలోచన తప్పని.. హెచ్చరిస్తాడు. మురారి మాటలు ఏ మాత్రం లెక్క చేయని ముకుంద.. ఎప్పటికైనా నువ్వు నేను ఒకటవ్వాల్సిందే. ఈరోజు కాకపోతే రేపైనా కృష్ణ నీ జీవితంలో నుంచి వెళ్లిపోవాల్సిందే అంటూ తన దుర్బుద్ధిని చెప్తుంది. కోపంతో మండిపోతున్న మురారి.. అది ఈ జన్మలో జరగదు అని ముకుందకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. Nagababu: ఆ వ్యాఖ్యల పై నన్ను క్షమించండి.. వైరలవుతున్న నాగ బాబు ట్వీట్ ముకుంద నిజస్వరూపం పూర్తిగా తెలుసుకున్న కృష్ణ.. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ బయట మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన రేవతి.. టిఫిన్ చేయమంటే.. ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. కోపంలో ఉన్న కృష్ణ.. ముకుంద చేస్తుంది కదా... మళ్ళీ నేను ఎందుకు అని విసుక్కుంటుంది. ముకుంద చేసిన టిఫిన్ తినడం ఇష్టంలేని మురారి బయటకు వెళ్లాలని అనుకుంటాడు. మురారి హడావిడిగా బయటకు వెళ్లడం గమనించిన కృష్ణ, రేవతి.. టిఫిన్ చేసి వెళ్ళమని చెప్తారు. మురారి మాత్రం తినకుండానే వెళ్ళిపోతాడు. నిజం తెలిసిన కృష్ణ.. మీరు ఎందుకు వెళ్తున్నారో నాకు అర్థమైంది ఏసీపీ సార్ అని మనసులో అనుకుంటుంది. ప్రేమతో మురారి కోసం ఆనియన్ దోషాలు వేసిన ముకుంద అందరిని టిఫిన్ చేయడానికి పిలుస్తుంది. కానీ మురారి మాత్రం రాకపోవడంతో బాధపడుతుంది. ఇంతలో ఆదర్శ్.. మురారికి ఆనియన్ దోష అంటే చాలా ఇష్టం అని చెప్తాడు. దీంతో ముకుంద ఇది చేసింది కూడా మురారి కోసమే అని మనసులో అనుకుంటుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన మురారి.. తన ఫ్రెండ్ గోపిని కలిసి ముకుంద ప్రవర్తన గురించి చెప్తాడు. మరో వ్యక్తితో పెళ్ళైన తర్వాత కూడా.. నన్నే కావాలనే తన ఆలోచనను ఇంక ఎప్పుడు మార్చుకుంటుంది అని కోప్పడతాడు. పాపం ఆదర్శ్ అన్నీ మర్చిపోయి హాయిగా ఉండేవాడు.. అనవసరంగా ఆశలు పెంచి ఇక్కడ తీసుకొచ్చాను అని ఫీల్ అవుతాడు. గోపితో మాట్లాడి బయటకు వచ్చిన మురారి.. అక్కడ కృష్ణను చూసి షాక్ అవుతాడు. నువ్వెంటి కృష్ణ ఇక్కడ అని టెన్షన్ గా అడుగుతాడు. నేను విన్నాను, నేను ఉన్నాను నాకు అంతా తెలిసిపోయింది ఏసీపీ సార్ అని చెప్తుంది. ముకుంద కాలు నొప్పి నాటకం ఆడిన రోజే నాకు అనుమానం మొదలైంది అని చెప్తుంది. ఇప్పుడు టెన్షన్ పడితే సరిపోదు ప్రశాంతంగా ఏం చేయాలో ఆలోచిద్దాం అని మురారితో అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. Also RPrabhas Spirit Movie: పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్.. స్పిరిట్ స్టోరీ లైన్ పై సందీప్ వంగా క్లారిటీ #krishna-mukunda-murari-today-episode మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి