Krishna Mukunda Murari: ముకుంద తన ఫోన్ లో మురారి పేరును 'నా మొగుడు' అని సేవ్ చేసుకోవడంతో అనుమానం వచ్చిన కృష్ణ.. చీరలు ఇవ్వాలనే వంకతో.. ముకుంద రూమ్ కు వెళ్లి ఫోన్ చెక్ చేస్తుంది. కానీ ముకుంద ఫోన్ లో మురారి నెంబర్ 'నా మొగుడు' అనే పేరుతో సేవ్ లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంటుంది కృష్ణ.
కృష్ణ అనుమానాన్ని ముందే గమనించిన ముకుంద.. తను లోపలికి రాకముందే 'నా మొగుడు' అని సేవ్ చేసుకున్న మురారి పేరును మార్చేస్తుంది. ఇది తెలియని కృష్ణ మళ్ళీ ముకుంద మాయలో పడిపోతుంది.
మురారి జాగింగ్ కోసమని బయటకు వెళ్తాడు. అక్కడ ముకుందను చూసిన మురారి.. ఒక్కదానివే వచ్చావా..? ఆదర్శ్ ఎక్కడ అని అడుగుతాడు. వెంటనే ముకుంద ఏడవడం స్టార్ట్ చేస్తుంది. దాంతో కంగారు పడిపోయిన మురారి.. ఆదర్శ్ కు.. ఏమైనా అయ్యిందా అని అడుగుతాడు.
ఆదర్శ్ అంటే ఇష్టం లేని ముకుంద.. మురారి అలా అడగగానే.. ఆదర్శ్ పేరుతో ఎందుకు నా ప్రాణాలు తీస్తున్నావు.. నేను ప్రాణాలతో ఉండటం ఇష్టం లేదా? అని గట్టిగా అరిచేస్తుంది.
ముకుంద మాటలకు షాకైన మురారి.. ఎందుకిలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. నాకు ఇష్టం లేని జీవితంలోకి నన్ను నెట్టేశావు.. నన్ను బ్రతికున్న శవంలా మార్చేశావ్. ఇష్టం లేని మనిషితో జీవితం పంచుకోవడం నరకంగా ఉంటుంది. నువ్వు నా జీవితంలో ఉన్నా.. లేకపోయినా నేను నిన్నే ప్రేమిస్తాను. ఆదర్శ్ అంటే నాకు ఇష్టం లేదు. ఎలాగైనా సరే.. నువ్వే తనను ఇక్కడి నుంచి పంపించేయాలి. ఆదర్శ్ తో శోభనం జరిగితే చచ్చిపోతానని మురారిని బెదిరిస్తుంది ముకుంద.
మరో వైపు భార్య ముకుంద పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆదర్శ్.. కళలు కంటూ ఉంటాడు. ముకుంద నిజంగానే తనతో శోభనానికి ఒప్పుకుందని ఆనందంతో తేలిపోతుంటాడు.
జాగింగ్ కోసం వెళ్లిన మురారి ఇంకా రాకపోవడంతో.. ఎదురుచూస్తూ ఉంటుంది కృష్ణ. ఆయన ఇంత సమయం అయినా రాలేదు ఏంటీ అని అత్త రేవతిని అడుగుతుంది.
ముకుంద నిజస్వరూపం తెలుసుకున్న మురారి.. ఇప్పుడు ఈ విషయం ఆదర్శ్ కు తెలిస్తే ఏమవుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అసలు శోభనం ఎలా క్యాన్సిల్ చేయాలనీ టెన్షన్ పడుతుంటాడు మురారి.