Krishna Mukunda Murari: కృష్ణకు షాకిచ్చిన ముకుంద .. ఇప్పటికీ మురారినే ప్రేమిస్తూ

కృష్ణ.. ఆదర్శ్- ముకుందల కోసం ఉంగరాలు తీసుకొచ్చి మార్చుకోమని సర్ప్రైజ్ చేస్తుంది. ఇప్పటికీ మురారినే ప్రేమిస్తున్న ముకుంద.. ఆదర్శ్ రింగ్ తొడిగే సమయానికి వద్దని చెప్పడంతో ఇంట్లో అందరు షాక్ అవుతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.

Krishna Mukunda Murari: కృష్ణకు షాకిచ్చిన ముకుంద .. ఇప్పటికీ మురారినే ప్రేమిస్తూ
New Update

Krishna Mukunda Murari: మధు తన సినిమా కోసం స్టోరీ రాసుకుంటూ హాల్లో కూర్చుంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన నందుకు.. మధు కథ చెప్తానని అంటాడు. వెంటనే నందు అమ్మో నీ కథ నేను వినను అంటూ ఫన్ చేస్తుంది.

publive-imageఇంతలోనే హాల్లోకి వచ్చిన కృష్ణ హడావిడి చేస్తూ ఉంటుంది. ఏంటీ తింగరి పిల్లా ఇంత హడావిడి చేస్తున్నావని కృష్ణను..  అత్త రేవతి అడుగుతుంది. దానికి కృష్ణ ఈరోజు ముకుంద- ఆదర్శ్ ల కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశానని చెప్పి.. అందరినీ సస్పెన్స్ లో పెడుతుంది.

publive-imageముకుంద- ఆదర్శ్ రాగానే.. మీరు ఇద్దరు ఒకటైన సందర్భంగా ఈ ఉంగరాలు మార్చుకోమని.. వాళ్ళను సర్ప్రైజ్ చేస్తుంది. కృష్ణ ఇలా చెప్పడంతో ఆదర్శ్ పై ఇష్టం లేని ముకుంద ఎలా తప్పించుకోవాలని టెన్షన్ పడుతుంది.

publive-imageముకుంద టెన్షన్ పడడం గమనించిన మధు.. రింగ్ తొడగడం ముకుందకు ఇష్టం లేనట్లుగా ఉందని అంటాడు. వెంటనే కృష్ణ అదేం లేదు అందరు ఉన్నారని కాస్త సిగ్గు పడుతుంది అని మధుతో చెప్తుంది.

publive-imageఇంకా మురారినే ఇష్టపడుతున్న ముకుంద.. దీని నుంచి తప్పించుకోవడానికి.. ఆదర్శ్ రింగ్ తొడిగే సమయంలో వద్దని చెప్తుంది.  ముకుంద ఇలా చెప్పగానే కృష్ణ షాకవుతుంది. మళ్ళీ ఏమైందని ఇంట్లో అందరు టెన్షన్ పడతారు.

Also Read: Anchor Sreemukhi : పింక్‌ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న శ్రీముఖి.. ఫొటోలు చూస్తే ఫ్లాట్‌ అవ్వాల్సిందే

publive-imageఇది కవర్ చేసుకోవడానికి ముకుంద అదిరిపోయే ప్లాన్ వేస్తుంది. ఈ రింగ్స్ మేము మార్చుకోవడం కంటే కృష్ణ- మురారి మార్చుకుంటే బాగుటుంది. వాళ్ళిద్దరి పెళ్లి కూడా నేను చూడలేదు అని చెప్పి.. వాళ్ళిద్దరి చేత రింగ్స్ మార్పించి తెలివిగా తప్పించుకుంటుంది ముకుంద.

publive-imageఆ తరువాత రూమ్ లోకి వచ్చిన ఆదర్శ్ ను.. నేను అలా చేశానని బాధపడుతున్నారా అని అడుగుతుంది. భార్య మారిపోయింది అని భ్రమలో ఉన్న ఆదర్శ్.. నీది చాలా గొప్ప మనసు.. మనిద్దరిని కలిపిన కృష్ణ, మురారిని మళ్ళీ ఒకటి చేశావు. నీ లాంటి భార్య దొరకడం నా అదృష్టమని పొగడ్తలతో ముంచేస్తాడు.

publive-imageభర్త ఇలా చెప్పడంతో ఎమోషనల్ అవుతుంది ముకుంద. ఆదర్శ నా పై ప్రేమను పెంచుకుంటున్నాడు. కానీ నా మనసులో మాత్రం ఇంకా మురారినే ఉన్నాడు. నాకు ఇంత సహాయం చేసిన కృష్ణను నేను మోసం చేస్తున్నాను అనుకుంటూ మనసులో బాధపడుతుంది ముకుంద. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image Also Read: Brahmamudi Serial: ఆఫీస్ లోకి కావ్య గ్రాండ్ ఎంట్రీ .. కుళ్ళుకొని చస్తున్న అత్తాకోడళ్ళు

#krishna-mukunda-murari
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe