Krishna Mukunda Murari : తల్లి కాబోతున్న కృష్ణ.. ఆదర్శ్ కు నిజం చెప్పాలని నిర్ణయించుకున్న ముకుంద

కృష్ణ తల్లి కావాలని ఆశపడుతున్న భవానీ దేవి.. కృష్ణకు అమ్మాయి బొమ్మను గిఫ్ట్ గా ఇచ్చి అమెరికా వెళ్ళిపోతుంది. మరో వైపు ఆదర్శ్ కు నిజం చెప్పేయాలని ట్రిప్ ప్లాన్ చేస్తుంది ముకుంద. ఇలా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Krishna Mukunda Murari : తల్లి కాబోతున్న కృష్ణ.. ఆదర్శ్ కు నిజం చెప్పాలని నిర్ణయించుకున్న ముకుంద

Krishna Mukunda Murari Today Episode : భార్య ప్రేమలో తేలిపోతున్న ఆదర్శ్(Adarsh).. ముకుంద(Mukunda) ను కాశ్మీర్(Kashmir) వెళదామని అడుగుతాడు. ఎందుకు అని ముకుంద అడగగా.. అక్కడ ఉన్న ప్రకృతి అందాలు, ప్రశాంతను అనుభవిస్తే.. ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి రాలేవు. మనిద్దరం హ్యాపీగా అక్కడే ఉందామని చెప్తాడు ఆదర్శ్.

Adarsh - Mukunda
ఇంకా మురారినే ప్రేమిస్తున్న ముకుంద.. నాకు మురారి(Murari) ఎక్కడ ఉంటే అదే నా స్వర్గం.. అక్కడే నేను ప్రశాంతంగా ఉండగలను అని మనసులో అనుకుంటుంది. ఇక ఆదర్శ్ మనం అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలి.. ఇష్టమైన వాళ్ళతో.. ఇష్టమైన చోట ఉంటే స్వర్గంలా ఉంటుందని చెబుతాడు. దీంతో ముకుంద ఆదర్శ్ రోజు రోజుకు నా పై ప్రేమను మరింత పెంచుకుంటున్నడు.. తనను ఎక్కడికైనా బయటకు తీసుకెళ్లి నిజం చెప్పేయాలని అనుకుంటుంది ముకుంద.

Mukunda
ఇటు కృష్ణ మురారి ఇద్దరు రూమ్ లో ఉంటారు. ఇంతలో కృష్ణ(Krishna).. వాళ్ళ చిన్నమ్మ దగ్గరికి వెళదామని మురారిని అడుగుతుంది. దానికి మురారి ఆలోచిద్దాంలే కృష్ణ అని అంటాడు. మురారి అలా అనడంతో హార్ట్ అయిన కృష్ణ.. మీ వాళ్ళ దగ్గరికి అనగానే పరుగెత్తుకుంటూ వెళ్తారు. అదే మా వాళ్ల దగ్గరకు వెళదాం అంటే మాత్రం ఆలోచిద్దాం అంటున్నారు అని మురారితో గొడవ పడుతుంది.Krishna - Murari
మరో వైపు అందరు హల్లో కూర్చున్న నందు(Nandu), రేవతి(Revathi).. మధు పై జోకులు వేస్తూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో కృష్ణ, మురారి, ముకుంద, ఆదర్శ్ కూడా అక్కడికి వస్తారు. కృష్ణ రాగానే.. పెద్దమ్మ ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేశావా అని అడుగుతాడు మధు.

Nandu - Revathi - Madhu - Krishna - Murari - Mukunda - Adarsh - Krishna

లేదు ఇప్పుడు ఓపెన్ చేస్తానని.. అందరి ముందు గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది కృష్ణ. భవానీ దేవి ఇచ్చిన గిఫ్ట్ చూడగానే కృష్ణతో పాటు అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. కృష్ణ తల్లి కావాలని ఆశపడుతున్న భవానీ దేవి.. కృష్ణకు అమ్మాయి బొమ్మను గిఫ్ట్ ఇచ్చింది. గిఫ్ట్ తో పాటు ఇంటి బాధ్యతలు కూడా తానే చూసుకోవాలని లెటర్ లో రాస్తుంది భవానీ.

Bhavani Devi

ఇక ఆదర్శ్ కు నిజం చెప్పేయాలని అనుకున్న ముకుంద.. కృష్ణ, మురారిని కూడా ట్రిప్ కు వెళ్ళడానికి ఒప్పిస్తుంది. ఒకప్పుడు బయటకు రమ్మంటే తప్పించుకునే.. ముకుంద ఇప్పుడు తానే ట్రిప్ ప్లాన్ చేసింది. అంటే ముకుంద నిజంగానే మారిపోయింది అని భ్రమపడతాడు ఆదర్శ్.

Mukunda - Krishna - Murari
కృష్ణ భవానీ దేవి ఇచ్చిన బొమ్మను చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో రూమ్ లోకి వచ్చిన మురారి.. ఆ బొమ్మను తీసుకుంటే సరిపోదు.. పెద్దమ్మ మన మీద పెట్టుకున్న ఆశలను కూడా తీర్చాలి అంటూ కృష్ణతో చెప్తాడు. మురారి ఇలా చెప్పగానే కృష్ణ సిగ్గుపడుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Krishna - Murari

Also Read : Paayal Raajput Video: బాటిల్ తో ప్రియుడి తల పగలగొట్టిన పాయల్.. వైరలవుతున్న వీడియో

Advertisment
Advertisment
తాజా కథనాలు