Krishna Mukunda Murari Serial Today Episode: వాలెంటైన్స్ డే కాంపీటీషన్ లో బెస్ట్ కపుల్ గా కృష్ణ, మురారిలను ప్రకటిస్తుంది భవానీదేవి. ముందుగా ఆదర్శ్, ముకుందలను బాగా చేశారని ప్రశంసిస్తుంది. ఆ తర్వాత బెస్ట్ కపులైన కృష్ణ, మురారికి గిఫ్ట్ ఇస్తుంది. కృష్ణ మాత్రం ఆదర్శ్, ముకుందకు రాలేదని ఫీల్ అవుతుంది.
ఆ తర్వాత భవానీ దేవి.. అందరు హాల్లోకి రండి ఒక సీరియస్ విషయం మాట్లాడాలని చెబుతుంది. అందరు వచ్చాక.. తాను నెల రోజుల పాటు అమెరికా వెళ్తున్నానని చెబుతుంది. దీంతో ఇంట్లో అందరు షాక్ అవుతారు. ఇంత సడెన్ గా వెళ్లడం ఏంటని రేవతి అడుగుతుంది. మా ఫ్రెండ్ కు చిన్న సమస్య వచ్చింది అందుకే వెళాల్సి వస్తుందని చెప్తుంది.
ఇక అమెరికా వెళ్తున్న భవానీ దేవి ఇంట్లో అందరికీ జాగ్రత్తలు చెబుతుంది. ఆదర్శ్ ను పిలిచి.. తాను అమెరికా వెళ్లి వచ్చాక ఆదర్శ్ ఏం చేయాలో చెప్తానని అందరినీ సస్పెన్స్ లో పెడుతుంది. ఇక కృష్ణ మాత్రం భవానీ వెళ్లడం ఇష్టం లేదని బాధపడుతుంది.
మరో వైపు రేవతి కూడా భవానీ దేవి అమెరికా వెళ్లడం ఆందోళనగా ఉందని చెప్తుంది. దీంతో భవానీ.. ప్రతీ దానికి భయపడకు.. ఇక నుంచి నా బాధ్యతలు అన్నీ నువ్వే చూసుకోవాలి అని రేవతికి దైర్యం చెప్తుంది. ఇంతలో ముకుంద.. నాకు ఏం చెప్పారా..? అత్తయ్య అని అడుగుతుంది. దానికి భవానీ దేవి.. నువ్వు మారడం నిజమే కదా.. ఇక నీ భర్తతో సంతోషంగా ఉండు.. అంతే అని చెప్పి వెళ్ళిపోతుంది.
కృష్ణ వాలెంటైన్స్ డే కాంపిటీషన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ముకుంద, ఆదర్శ్ కూడా బాగా చేశారు. కానీ అత్తయ్య మాకే గిఫ్ట్ ఎందుకు ఇచ్చారు. అంటే పెద్ద అత్తయ్య కు ముకుంద పై ఇంకా అనుమానం పోలేదా..? అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన రేవతి.. ముకుంద మంచి భార్య కాదు.. అందుకే అక్క మీకు గిఫ్ట్ ఇచ్చిందని చెప్తుంది.
ముకుంద నిజంగానే మారిపోయిందని నమ్ముతున్న ఆదర్శ్.. భార్యతో కలిసి చేసిన డాన్స్, స్కిట్ గురించి తలుచుకొని సంతోషంతో మురిసిపోతూ ఉంటాడు. మళ్ళీ వెంటనే.. మురారి, ముకుంద కలిసి ఉన్న ఫోటోలు గుర్తుకు రాగానే.. భార్య పై అనుమానం మొదలవుతుంది. కానీ ముకుంద ప్రేమ నిజమని నమ్మిన ఆదర్శ్.. తనను అనుమానించడం తప్పని భావిస్తాడు.
ఇంతలో రూమ్ లోకి ముకుంద వస్తుంది. భార్య రాగానే ఆదర్శ్ ప్రేమగా.. ముకుంద అని పిలుస్తాడు. దాంతో ముకుంద.. మళ్ళీ ఏం అడుగుతాడో ఏంటో అని టెన్షన్ పడుతుంది. నిన్న స్కిట్ లో చేసినట్లు.. నీ చేతులతో మందు పోయామని అడుగుతాడు ఆదర్శ్. భార్య ప్రేమ నిజమని ఆనందంలో తేలిపోతున్న ఆదర్శ్.. మనిద్దరం కలిసి ఎంజాయ్ చేయడానికి కాశ్మీర్ వెళదామని ముకుందతో చెప్తాడు. ఇక భర్త పై ఇష్టం లేని ముకుంద.. ఆదర్శ్ కు నిజం తెలిసిన రోజున ఏమైపోతాడో అని టెన్షన్ పడుతుంది.
Also Read: Guntur Kaaram: ఓటీటీలో గుంటూరు కారం ఘాటు.. టాప్ 1 ట్రెండింగ్ గా రికార్డు