Krishna Mukunda Murari: భార్య ముకుందపై ఆదర్శలో అనుమానం.. మురారినే ప్రేమిస్తూ భర్తకు మోసం

భార్య ముకుంద కింద పడుకోవడం చూసిన ఆదర్శ్ కి అనుమానం మొదలైంది. దీంతో ముకుందను.. నేనంటే ఇష్టం ఉందా లేదా? అని గట్టిగా నిలదీస్తాడు. మరోవైపు కృష్ణ.. ముకుంద, ఆదర్శ్ కోసం ఒక సప్రైజ్ ప్లాన్ చేస్తుంది. ఇలా సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఏం జరిగిందో చూసేయండి.

Krishna Mukunda Murari: భార్య ముకుందపై ఆదర్శలో అనుమానం.. మురారినే ప్రేమిస్తూ భర్తకు మోసం
New Update

Krishna Mukunda Murari Serial:  ఇంట్లో అందరు కూర్చొని భోజనం చేస్తుంటారు. ఇదే సమయంలో ఆదర్శ.. తన భార్య ముకుందకు భవానీదేవి పట్ల ఉన్న ప్రేమ, గౌరవం గురించి వాళ్ళ అమ్మకు చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇంతలో ముకుంద.. ఒకరి మీద మన ఇష్టం.. వాళ్లకు ఇచ్చే విలువను బట్టి తెలుస్తుంది కదా మురారి అంటూ ఇండైరెక్ట్ గా మురారి పై తనకున్న ఇష్టాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది.

publive-imageభోజనం తర్వాత తాగిన మత్తులో రూమ్ లోకి వచ్చిన మురారి బెడ్ పై కాకుండా కింద పడుకుంటాడు. ఇది చూసిన కృష్ణ మీరు కింద పడుకుంటే.. నేను కిందే పడుకుంటాను. ఒకప్పుడలా మన మధ్య దూరం లేదు.. ఇప్పుడు మన ఇద్దరము ఒకటే.. ఇద్దరం పైనే పడుకుందామని మురారితో చెబుతుంది.

publive-image

ఉదయం లేవగానే.. ముకుంద కింద బెడ్ వేసుకొని పడుకోవడం చూసిన ఆదర్శ్ కు భార్య పై అనుమానం మొదలవుతుంది. అసలు ముకుంద మనసులో నేను ఉన్నాన..?  లేదంటే ఉన్నట్లు నటిస్తుందా అని ఆలోచిస్తాడు ఆదర్శ్.

Also Read: Anchor Sreemukhi : పింక్‌ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న శ్రీముఖి.. ఫొటోలు చూస్తే ఫ్లాట్‌ అవ్వాల్సిందే

publive-imageరూమ్ లోకి వచ్చిన ముకుందను కింద పడుకోవడం పై ఆదర్శ్ గట్టిగా నిదీస్తాడు. నిజంగానే నేనంటే నీకు ఇష్టం ఉందా..? మనస్ఫూర్తిగానే నన్ను ఇక్కడకు రప్పించావా..? అని ప్రశ్నిస్తాడు. భర్తకు అనుమానం వచ్చిందని గమనించిన ముకుంద కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. శోభనానికి ముందు ఒకే దగ్గర ఉంటే అరిష్టమని కింద పడుకున్నాను అంతే అని చెప్తుంది.

publive-imageఆదర్శ్ నిలదీయడంతో తనలో.. తాను మదన పడుతూ ఆలోచిస్తుంది ముకుంద. నా మనసులో ఇంకా మురారినే ఉన్నాడు. ఇంకా ఎన్ని రోజులు ఆదర్శ్ తో ఇలా అబద్దాలు చెప్పాలి.. రోజులు గడిచే కొద్దీ ఆదర్శ్ నా పై ఆశలు పెంచుకుంటున్నాడు అని మనసులో బాధపడుతుంది మురారి.

publive-image

భర్త కోసం కృష్ణ కాఫీ తీసుకొని వస్తుంది. అప్పుడే నిద్ర లేచిన మురారి.. కృష్ణతో కాసేపు సరదాగా కబుర్లు చెబుతూ.. కృష్ణను ఆటపట్టించే ప్రయత్నం చేస్తాడు.

publive-imageకృష్ణ.. ముకుంద, ఆదర్శ్ ఒకటైన సందర్భంగా వాళ్ళిద్దరికి సర్ప్రైజ్ ఇస్తుంది. రింగ్స్ తీసుకొచ్చి ఇద్దరినీ మార్చుకోమని చెబుతుంది. మరి ఆదర్శ్ అంటే ఇష్టం లేని ముకుంద భర్తకు రింగ్ తొడుగుతుందా..? లేదా ..? అనేది రేపటి ఎపిసోడ్ లో తెలుస్తుంది.

publive-image

Also Read: Brahmamudi Serial: ఆఫీస్ లోకి కావ్య గ్రాండ్ ఎంట్రీ .. కుళ్ళుకొని చస్తున్న అత్తాకోడళ్ళు

#krishna-mukunda-murari-serial
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe