కేపీ చౌదరి కేసులో సినీ ప్రముఖులపై ఆరా తెలుగు సినీ పరిశ్రమలో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన కబాలీ మూవీ నిర్మాత కేపీ చౌదరి కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. రిమాండ్ రిపోర్టులో 14 మంది పేర్లను పోలీసులు పేర్కొన్నారు. వాళ్ల గురించి ఆరా తీస్తున్నారు. కేపీ చౌదరి నిర్వహించిన పార్టీలో మాదకద్రవ్యాలు వినియోగించినట్లు గుర్తించిన పోలీసులు.. దానికి తగిన ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. By Vijaya Nimma 28 Jun 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి సినీ ప్రముఖులతో సంబంధాలపై.. కేపీ చౌదరితో తమకు ఎలాంటి సంబంధం లేదని పలువురు యాక్టర్లు పేర్కొన్నారు. కేపీతో ఫ్రెండ్షిప్ తప్ప మత్తు పదార్థాలకు సంబంధం లేవని చెప్తున్నారు. అయితే, కేపీ కేసులో సైబరాబాద్ పోలీసుల విచారణ కొనసాగుతుంది. కేపీ వాట్సాప్ డాటాను పోలీసులు రీట్రైవ్ చేశారు. సినీ ప్రముఖులతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి విచారణ చేయనున్నారు. ఇప్పటికే 14 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. బ్యాంక్ ఖాతా లావాదేవీలపై ఆరా పోలీసులు మాత్రం కేపీ చౌదరి కాల్ డేటాతో పాటు.. ఆయన బ్యాంక్ ఖాతాలో అనుమానస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఇందులో ఎవరెవరికి సంబంధం ఉంది అనే కోణంగా ఎంక్వైరీ చేస్తున్నారు. కేపీ చౌదరిని ఇప్పటికే పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. అతను ఇచ్చిన పార్టీలో ఎవరెవరు ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో పలువురు ప్రముఖ సినీ నటుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి