కేపీ చౌదరి కేసులో కీలక విషయాలు కబాలి సినిమా నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ సినీ, క్రీడా, రాజకీయా వర్గాల్లో సంచలనంగా మారింది. మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరికి పలువురు సెలబ్రెటిలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. By Vijaya Nimma 24 Jun 2023 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి ఈ నేపథ్యంలో కేపీ చౌదరిని కస్టడీకి తీసుకుని 2 రోజుల పాటు విచారించిన పోలీసులు.. కీలక విషయాలు రాబట్టినట్లు కస్టడీ రిపోర్టులో పేర్కొన్నారు. పలువురు సినీ సెలబ్రెటిలకు చౌదరి మాదకద్రవ్యాలు విక్రయించినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ ఫేమ్ అషురెడ్డి, మరో 12 మంది పేర్లను పోలీసులు కస్టడీ రిపోర్టులో పేర్కొన్నారు. కస్టడీ రిపోర్ట్‌లో బ్యాడ్మింటన్ ప్లేయర్ ఇదిలా ఉండగా.. కేపీ చౌదరి కస్టడీ రిపోర్ట్‌లో ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కిరెడ్డి పేరు తెరపైకి రావడం కలకలం రేపుతోంది. సిక్కిరెడ్డి ఫ్లాట్‌లోనే కేపీ చౌదరి మాదకద్రవ్యాలతో ఓ పార్టీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. పాత పరిచయాల నేపథ్యంలో కేపీ చౌదరికి సిక్కిరెడ్డి తన ఫ్లాట్‌ను ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, మత్తు పదార్థాలు కేసులో ప్రొడ్యూసర్ కేపీ చౌదరి అరెస్ట్ సమయంలో సిక్కిరెడ్డి ఇండియాలో లేనట్లు సమాచారం. ప్రస్తుతం సిక్కిరెడ్డి చైనాలో ఉన్నట్లు తెలుస్తోంది. కేపీ చౌదరి కాల్ లిస్ట్‌పై పోలీసులు మరింత ఫోకస్ పెట్టడంతో ఈ వ్యవహారంలో ఇంకా ఎంతమంది పేర్లు తెరపైకి వస్తాయో అనే ఉత్కంఠ నెలకొంది. నివాస వేడుకల్లో కొకైన్ దందా మాదకద్రవ్యాలు కేసులో 'కబాలి' తెలుగు సినిమా నిర్మాత సుంకర కృష్ణప్రసాద్ అలియాస్ కేపీ చౌదరి అరెస్ట్ సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా, కేపీ చౌదరి సాగించిన కొకైక్ దందా.. కొనుగోలు చేస్తున్న వారి జాబితాను పోలీసులు రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు. ఈ జాబితాలో అషూరెడ్డి సహా పలువురు సినీ ప్రముఖుల పేర్లు కూడా ఉన్నట్లు తెలిసింది. విజయవాడ భరత్, చింతా సాయిప్రసన్న, చింతా రాకేష్ రోషన్, నల్లా రతన్‌రెడ్డి, ఠాగూర్ విజ్ అలియాస్ ఠాగూర్ ప్రసాద్ మోటూరి, తేజ చౌదరి అలియాస్ రఘు తేజ, వంటేరు సావన్ రెడ్డి, సనా మిశ్రా, సుశాంత్, నితినేష్, అనురూప్ ఈ జాబితాలో ఉన్నారు. వీరంత స్నేహిత హిల్స్‌లోని సిక్కిరెడ్డి నివాసంలో వేడుకలు చేసుకుంటూ.. కొకైన్ తీసుకునేవారని ఆధారాలు బయటపడ్డాయి. బ్యాంక్ ఖాతాలపై ఆరా ఇద్దరు సినీ దర్శకులు, ఇద్దరు నటీమణులు, కొందరు రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్లు చెబుతున్నా.. వారి వివరాలు బయటపడలేదు. మరోవైపు, కేపీ చౌదరి నాలుగు సెల్‌ఫోన్లలో వందల మంది ప్రముఖుల ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వీరిలో సుమారు 20 మందితో 4-5 నెలల నుంచి తరచూ మాట్లాడిన ఫోన్ కాల్స్ వెలుగుచూశాయి. ఇతడి బ్యాంక్ ఖాతాల్లో రూ. లక్షల్లో లావాదేవీలు జరిగినట్లు నిర్ధరించారు. గత మే నెలలో కేపీ చౌదరి స్నేహితుడు బెజవాడ భరత్‌తో కలిసి బెంగళూరు వెళ్లారు. అక్కడ వీకెండ్ పార్టీ సందర్భంగా.. పెద్ద మొత్తంలో కొకైన్ క్రయ, విక్రయాలపై నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో పలువురితో పరిచయాలు ఆ తర్వాత ఏపీలోని భీమవరం నివాసి సురేష్ రాజుతో కేపీ చౌదరి ఫోన్ సంభాషణలు జరిపాడు. హనుమకొండకు చెందిన అనురూప్‌తో వందసార్లు ఫోన్లో మాట్లాడాడు. పంజాగుట్టకు చెందిన పుష్పక్ క్యాబ్స్ యజమాని రతన్‌రెడ్డి, సినీ నటి ఆషు రెడ్డితోనూ కేపీ చౌదరి అత్యధిక సార్లు ఫోన్‌లో సంభాషణలు జరిపాడు. హైదరాబాద్‌లోని డాక్టర్ సుధీర్, సినీ నటి జ్యోతి, అమెరికాలో ఉన్న డీ అమర్‌లతో మాట్లాడాడు. గోవాలోని రెస్టారెంట్ నిర్వాహకుడు మనీష్ షా బ్యాంక్ ఖాతాకు చౌదరి రూ. 85వేలు పంపాడు. ఏపీలోని మంగళగిరికి చెందిన షేక్ ఖాజా బ్యాంక్ ఖాతాలో రూ. 2 లక్షలు, బీహార్‌కు చెందిన కౌశిక్ అగర్వాల్ ఖాతాలో రూ. 16వేలు, విజయవాడకు చెందిన టీ సుజాత బ్యాంక్ ఖాతాలో రూ. లక్ష చొప్పున లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఇతర దేశాల్లో... ఆ బ్యాంక్ ఖాతాలను ఎవరు నిర్వహిస్తున్నారు? ఇతరుల పేర్లతో మాదకద్రవ్యాలు పెడ్లర్స్ వినియోగిస్తున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పలువురి పేర్లు బయటపడటంతో ఇప్పుడు కలకలం రేపుతోంది. తాజాగా, ఆషురెడ్డి సెలైన్ పెట్టుకున్నట్లు ఉన్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్నానని.. త్వరలోనే తిరిగి వస్తానని ఆషురెడ్డి తెలిపింది. అయితే, ఆమెకు ఏం జరిగిందనే విషయం మాత్రం చెప్పలేదు. మరోవైపు, మాదకద్రవ్యాలు వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. తన ఫోన్ ప్రదర్శించకూడదని కోరింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి