నారా లోకేష్ రాసలీల ఫోటోలను విడుదల చేసిన కోవూరు ఎమ్మెల్యే

నారా లోకేష్‌పై కోవూరు ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముందు నువ్వు తెలుగు మాట్లాడటం నేర్చుకో అన్నారు. సీఎం పట్టుకొని పిచ్చిపిచ్చిగా సంబోధిస్తే ప్రజలు తాటతీస్తారు లోకేష్‌ అంటూ హెచ్చరించారు. మీలాగా వెన్నుపోటు పొడిచే చరిత్ర మాది కాదన్నారు. నువ్వు చెప్పే అవినీతిని సీబీఐ విచారణలో నిరూపించాలని నారా లోకేష్‌కు సవాల్ విసిరారు.

New Update
నారా లోకేష్ రాసలీల ఫోటోలను విడుదల చేసిన కోవూరు ఎమ్మెల్యే

Kovuru MLA Nallapa Reddy fire on Lokesh

తెలుగులో స్ప‌ష్టంగా మాట్లాడు

ఇటీవ‌ల జ‌రిగిన యువ‌గళం బ‌హిరంగ స‌భ‌లో కోవూరు ఎమ్మెల్యే న‌ల్ల‌ప‌రెడ్డి 15 వందల కోట్ల అవినీతికి పాల్ప‌డ్డారంటూ నారాలోకేష్ విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ విమ‌ర్శ‌ల‌పై కోవూరు ఎమ్మెల్యే న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న కుమార్‌రెడ్డి విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో లోకేష్‌పై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే. విలేక‌రుల సాక్షిగా లోకేష్‌ను హెచ్చ‌రించారు. నారా లోకేష్‌ను మాడా లోకేష్ అని పేర్కొంటూ మంగ‌ళగిరినే మంద‌ల‌గిరి అంటూ మాట్లాడిన వాడివి నువ్వు,.. ముందు అస‌లు అత‌ను తెలుగులో స్ప‌ష్టంగా మాట్లాడడం నేర్చుకోవాలని సూచించారు. నేర్పించ‌డానికి వ‌చ్చిన టీచ‌ర్‌ను లేపుకెల్లిన చ‌రిత్ర లోకేష్‌దని విమ‌ర్శించారు.

వెన్నుపోటు పొడిచిన చ‌రిత్ర టీడీపీది

లోకేష్ విమ‌ర్శించిన‌ట్లుగా త‌ను క‌నుక 15 వందల కోట్ల అవినీతికి పాల్ప‌డిన‌ట్ల‌యితే సీబీఐ విచార‌ణ జ‌రిపిచాల‌ని అది క‌నుక నిజం అనితేలితే త‌న‌ను బుచ్చి న‌గ‌రంలో ఉరి వేయాల‌ని తెలిపారు. తాను ఎమ్మెల్యే అయిన త‌ర్వాత కోవూరు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంత‌గానో అభివృద్ధి చేశాన‌ని చెప్పారు. పిల్ల‌ను ఇచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చ‌రిత్ర టీడీపీ నేత చంద్ర‌బాబుద‌ని ఎద్దేవా చేశారు.

సీఎంని అంటే ప్ర‌జ‌లు తాట‌తీస్తారు..

గ‌తంలో కూడా చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేశాడ‌నీ, అప్పుడు కూడా టీడీపీ పార్టీని నేను నా గురించి విచారించుకోవాలని చెప్పాన‌ని గుర్తు చేశారు. ఇప్పుడు సీబీఐ విచార‌ణ‌కు నేను సిద్ధం అంటూ లోకేశ్‌కు స‌వాల్ విసిరారు ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌. అంతేకాకుండా లోకేష్ రాసలీలలు ఫోటోలను ఈ సంద‌ర్భంగా మీడియాకు విడుదల చేశారు. ఒక ముఖ్య‌మంత్రిని ప‌ట్టుకుని వాడు, వీడు అన‌డం త‌గ‌ద‌నీ...త‌మ ప్రియ‌త‌మ నేత జ‌గ‌న్‌ను ఇలా ఇష్ట‌మొచ్చిన‌ట్లు సంబోధిస్తే ప్ర‌జ‌లు తాట‌తీస్తార‌ని లోకేష్‌ను హెచ్చరించారు. నువ్వు చంద్ర‌బాబు నాయుడి కొడుకువు కావ‌చ్చు.. కానీ మా జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి వెంట్రుక కూడా పీక‌లేర‌ని ఇక‌పై ఇలాంటిపిచ్చి వేషాలు వేయొద్దంటూ లోకేష్‌పై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌.

Advertisment
Advertisment
తాజా కథనాలు