Anganwadis Protest: 'అంగన్వాడి కేంద్రాల తాళాలు పగలగొట్టడం సిగ్గుచేటు'

సమ్మెను నిర్వీర్యం చేసేందుకు అంగన్వాడి కేంద్రాల తాళాలు పగలగొట్టించటం సిగ్గుచేటని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఫైర్ అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం అంబేద్కర్ సెంటర్లో దీక్ష చేస్తున్న అంగన్వాడీలకు ఆయన సంఘీభావం తెలిపారు.

Anganwadis Protest: 'అంగన్వాడి కేంద్రాల తాళాలు పగలగొట్టడం సిగ్గుచేటు'
New Update

TDP Kothapalli Subbarayadu Supports to Anganwadis: ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీల ఆందోళన కొనసాగుతోంది. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు కచ్చితంగా నెరవేర్చాల్సిందేనని రోడెక్కారు. ఈ నిరసన కార్యక్రమానికి అటు టీడీపీ నాయకులతో పాటు జనసైనికులు సైతం మద్దతూ తెలుపుతున్నారు. వారు డిమాండ్లు న్యాయమైనవేనని మద్దతు ప్రకటిస్తున్నారు.

Also Read: నేడు బిగ్ బాస్ ఫైనల్స్.. విన్నర్ ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

ఈ నేపథ్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం అంబేద్కర్ సెంటర్లో  అంగన్వాడిలు ఆందోళన చేపట్టారు. అయితే, ఎన్నీ రోజులైన వారు ఆందోళన విరమించకుండా నిరసన చేపట్టడంతో పలుచోట్ల  అంగన్వాడి కేంద్రాల తాళాలు పగలగొట్టించారు. అయినప్పట్టికి ఏ మాత్రం లెక్కచేయకుండా తమ సమ్మెను కొనసాగిస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం వీరి హామీలపై ఏ మాత్రం పట్టనట్టుగా వ్యవహారిస్తోంది.



Also Read: సీఎం రేవంత్ తో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ భేటీ.. కారణమిదేనా?

అంగన్వాడీలకు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సంఘీభావం తెలిపారు. ఎన్నికల్లో హామీలిచ్చిన ప్రభుత్వం నాలుగున్నర ఏళ్ళు అయినా వాటిని అమలు వరచకపోవడం దారుణమన్నారు. వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు. సమ్మె చేస్తున్న అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా, సమ్మెను నిర్వీర్యం చేసేందుకు అంగన్వాడి కేంద్రాల తాళాలు పగలగొట్టించటం సిగ్గుచేటని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఫైర్ అయ్యారు.

#andhra-pradesh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe