/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Peddavagu-Project.jpg)
Peddavagu Project:కొత్తగూడెం జిల్లా పెదవాగు ప్రాజెక్టుకు గండి పడింది. గురువారం రాత్రి ప్రాజెక్ట్‌కు గండి పడినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ప్రాజెక్టులో నీళ్లు మొత్తం ఖాళీ అయ్యాయి. ముంపు ప్రాంతాల్లో రాత్రంతా భయానక వాతావరణం నెలకొంది. రాత్రంతా భవనాలపైకి వెళ్లి ముంపు గ్రామాల ప్రజలు తలదాచుకున్నారు. పెదవాగు ఉధృతికి వేలేరుపాడులో వంతెన కొట్టుకుపోయింది. పెదవాగు ప్రాజెక్టు గండితో 40 మంది వరదలో చిక్కుకున్నారు. అశ్వారావుపేట మండలం నారాయణపురం బ్రిడ్జిపై చిక్కుకున్న 40 మందిని ఎయిర్ బోట్లతో బాధితులను తరలించారు సహాయక సిబ్బంది. దీనిపై సకాలంలో స్పందించాయి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు.