Congress Politics: నేను గెలిచే సీటును సీపీఐకి ఇస్తారా?: కాంగ్రెస్ లో కొత్తగూడెం చిచ్చు!

కొత్తగూడెం టికెట్ ను సీపీఐకి కేటాయించడంతో ఎడవల్లి కృష్ణ నేరుగా హైకమాండ్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనతో కలిసి రావాలని ఆయన కేడర్ ను కోరారు. ఈ పరిణామాలతో ఎడవల్లి కృష్ణ ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారాం సాగుతోంది.

New Update
Congress Politics: నేను గెలిచే సీటును సీపీఐకి ఇస్తారా?: కాంగ్రెస్ లో కొత్తగూడెం చిచ్చు!

నిన్న 16 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ (Congress) సెకండ్ లిస్ట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో టికెట్ దక్కని నేతలు భగ్గుమంటున్నారు. పటాన్ చెరు టికెట్ ను నీలం మధుకు ఇవ్వడంతో ఇన్నాళ్లుగా అక్కడ పని చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు ఏకంగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాటా శ్రీనివాస్ గౌడ్ కే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఖమ్మం జిల్లా కొత్తగూడెం కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ ఎడవల్లి కృష్ణ సైతం తీవ్రంగా స్పందించారు. ఈ సీటును సీపీఐకి (CPI) ఇవ్వాలని నిర్ణయించడంపై ఆయన ఫైర్ అయ్యారు.
ఇది కూడా చదవండి: Telangana: కాంగ్రెస్ కు షాక్.. బీఆర్ఎస్ లోకి మాజీ ఎమ్మెల్యే!?

ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. సర్వేలన్నీ తనకు అనుకూలంగా ఉంటే టికెట్ ను సీపీఐకి ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ హైకమాండ్ తప్పుడు నిర్ణయం తీసుకుందని ఫైర్ అయ్యారు. నైతిక విలువలు లేని సీపీఐ కోసం కాంగ్రెస్ అధిష్టానం కొత్తగూడెంను వదులుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పని చేసిన వారిని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తామంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు.

నేటి నుంచి సీపీఐ పతనం ప్రారంభమైందన్నారు. తాను తీసుకోబోయే నిర్ణయంతో కలిసిరావాలని కేడర్ ను కోరారు. భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. తాజా పరిణామాలతో ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే సీపీఐకి కొత్తగూడెంలో ఇబ్బందులు తప్పవనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందనే అంశం ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.
ఇది కూడా చదవండి: Ponguleti: పొంగులేటికి ఊహించని షాక్.. ఆ ముగ్గురి మాటే నెగ్గిందా?

ఇదిలా ఉంటే.. ఒక వేళ ఈ సీటును సీపీఐకి ఇవ్వకపోతే జలగం వెంకట్రావును పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది. దీంతో ఆయన కూడా హస్తం గూటికి చేరేందుకు సిద్ధం అయ్యారు. అయితే.. కాంగ్రెస్, సీపీఐ పొత్తు కన్ఫామ్ కావడంతో ఆయన కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు