Big Breaking: కొండా సురేఖకు యాక్సిడెంట్.. కాళ్లు, చేతులు, మొహానికి గాయాలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న రాహుల్ గాంధీ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. భూపాలపల్లిలో ఈ రోజు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న కొండా సురేఖ స్కూటీ నడుపుతూ కింద పడిపోయారు. దీంతో ఆమె కాళ్లు, చేతులు, మొహానికి గాయాలయ్యాయి.

Big Breaking: కొండా సురేఖకు యాక్సిడెంట్.. కాళ్లు, చేతులు, మొహానికి గాయాలు
New Update

Konda Surekha Bike Accident: మాజీ మంత్రి కొండా సురేఖకు (Konda Surekha) ప్రమాదం చోటు చేసుకుంది. రాహుల్‌గాంధీ (Rahul Gandhi) పర్యటన సందర్భంగా భూపాలపల్లిలో (Bhupalapalli) ఈ రోజు నిర్వహించిన నిరుద్యోగ బైక్ ర్యాలీలో కొండా సురేఖ స్కూటీ నడిపారు. ఈ క్రమంలో అదుపుతప్పి కిందపడిపోయారు. దీంతో సురేఖ కాళ్లు, చేతులు, మొహానికి గాయాలయ్యాయి. దీంతో అక్కడే ఉన్న సురేఖ భర్త కొండా మురళి హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. సురేఖ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సురేఖకు చికిత్స కొనసాగుతోంది. ప్రమాదం తర్వాత ఆర్టీవీతో ఆమె మాట్లాడారు. తనకు ర్యాలీ అంటే ఆసక్తి అని అన్నారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: కేసీఆర్‌పై ఈడీ, సీబీఐ కేసులు ఎందుకు వేయడం లేదు? రాహుల్ గాంధీ ఏం అన్నారంటే?

అయితే.. చాలా రోజుల తర్వాత స్కూటీ నడపడంతో కొంత కన్ఫ్యూజన్ కు గురయ్యాననని సురేఖ చెప్పారు. బైక్ పై వెళ్తూ తన స్కూటీని ఓవర్ టేక్ చేసి సెల్ఫీ తీసుకోవాలని ఇద్దరు యువకులు ప్రయత్నించారన్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వారు స్లో కావడంతో తన స్కూటీ వారి వాహనానికి తగిలి కింద పడ్డట్లు వివరించారు. వెంటనే తాను స్పృహ కోల్పోయానన్నారు. కాళ్లు, చేతులు, మొహానికి గాయాలయ్యాయని తెలిపారు. అదృష్టవశాత్తు తలకు ఎలాంటి గాయం కాలేదని చెప్పారు సురేఖ.

ఈ వార్త అప్డేట్ అవుతోంది..

#jayashankar-bhupalapalli #konda-surekha-bike-accident #telangana-elections-2023 #konda-surekha #rahul-gandhi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి