అంబేడ్కర్ కోనసీమ జిల్లా కోనసీమ వాసులను వరద భయపెడుతునే ఉంది. జిల్లాలో మళ్ళీ క్రమంగా పెరుగుతున్న వరద ఉదృతంగా పెరగటంతో అంబెడ్కర్ కోనసీమ జిల్లా వాసులు నరకం చూస్తున్నారు. నిన్న ఎగువ ప్రాంతాలలో వరద తగ్గిన లంక గ్రామాలకు నిలకడగా ఉన్న గోదావరి వరద.. ఒక్కసారిగా వైనతేయా, వశిష్ట, గౌతమి ,వృద్దగౌతమి నదులు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉధృతికి కాజ్వేలపైకి వరద నీరు చేరింది. నిన్న స్వల్పంగా తగ్గినా ఈరోజు మళ్ళీ శబరి నదికి వదర ప్రవహం పెరుగుతుంది. ప్రస్తుతం చింతూరు వద్ద శబరి నది నీటిమట్టం వరద నీరు 28 అడుగులకు చేరింది. మరోవైపు గోదావరికి వరద తాకిడితో పెరుగుతున్న నేపథ్యంలో ఎగపోటుకు శబరి నది గురవుతుంది.
అంతేకాకుండా ప్రధాన రహదారులను వరద నీటితో వాగులు ముంచెత్తుతున్నాయి. చింతూరు ఏజెన్సీలో ఇంకా 30 గ్రామాలకు రాకపోకలు కొనసాగటం లేదు. ధవళేశ్వరం వద్ద వరద ప్రవాహం 10.40 అడుగుల వద్ద నీటిమట్టం ఉండగా..7,96,836 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి దిగువకు అధికారులు విడుదల చేశారు. రాత్రి ఎడతెరిపిలేని వర్షంతో భద్రాచలం వద్ద పెరిగిన వరద ప్రస్తుత నీటిమట్టం 43.30 చేరగా... మళ్లీ గోదావరి తగ్గినట్టే తగ్గి పెరగడంతో గోదావరి తీర ప్రాంత వాసుల్లో భయాందోళనకు గురి అవుతున్నారు.
ఈ భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేస్తుంది. ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నారు. ప్రజలందరూ అవసరమైతేనే బయటికి రావాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు వెల్లడిస్తున్నారు. ఏమైనా ఎమర్జెన్సీగా అవసరం ఉంటే ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం అందించాలని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వరదల వల్ల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని.. పిల్లలు పెద్దలు.. వృద్ధులు ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చిన సమాచారం అందించాలని అధికారులు చెప్తున్నారు. బయటకు రాకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి ఏపీ అధికారులు చేస్తున్నారు.