CBN: జగన్‌ ఓ సైకో..మండపేటలో చంద్రబాబు రోడ్‌షో

సంపద సృష్టించడం తెలియని వ్యక్తి సైకో జగన్ అంటూ నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్‌కు పేదవాళ్ల పొట్టగొట్టడమే తెలుసంటూ ఫైర్ అయ్యారు. మండపేట బహిరంగా సభలో జగన్‌ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు.

CBN: జగన్‌ ఓ సైకో..మండపేటలో చంద్రబాబు రోడ్‌షో
New Update

సీఎం జగన్‌ ఓ సైకో అంటూ నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు. కోనసీమ జిల్లా మండపేట కలువ పువ్వు సెంటర్‌ వేదికగా జగన్‌పై ఫైర్ అయ్యారు చంద్రబాబు.

చంద్రబాబు ఏమన్నారంటే?

➼ రైతును రాజును చేస్తా.

➼ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తా.

➼ నేతన్నలను జగన్‌ మోసం చేశారు.

➼ సంపద సృష్టిస్తా.. ప్రజలకు పంచేస్తా.

➼ సంపద సృష్టించడం తెలియని వ్యక్తి సైకో జగన్.

➼ జగన్‌కు పేదవాళ్ల పొట్టగొట్టడమే తెలుసు.

➼ కరప్షన్‌, క్రైమ్‌ తగ్గిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.

➼ జాబు కావాలంటే టీడీపీని గెలిపించాలి.

➼ ఈ సైకో(జగన్) 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు.

➼ ఎక్కడైనా రోడ్లు వేశాడా, పరిశ్రమలు తెచ్చాడా?

➼ కరెంట్ రేట్లు పెంచం, తగిస్తాం..

➼ వైసీపీ ప్రభుత్వం 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటుంది

➼ టీడీపీ ప్రభుత్వం సంపద సృష్టించి మీకోసమే ఖర్చు చేస్తుంది.

చంద్రబాబు విజన్ 2047:
మరోవైపు చంద్రబాబు విజన్-2047పై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పోర్ట్ సిటీలో జరిగిన సమావేశంలో ఆయన విజన్-2047 డాక్యుమెంట్‌ను విడుదల చేయగా.. దానిపై సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. ఆర్థిక వృద్ధిలో దేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశంగా ఉంటుందని, ఇతర రంగాలలో దేశం రెండవ స్థానానికి ఎదుగుతుందని నాయుడు అభిప్రాయపడ్డారు. ఐదు ముఖ్యమైన వ్యూహాలను అవలంబిస్తే, దేశం ప్రపంచ అగ్రగామిగా నిలుస్తుందని ఆయన డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు. విజన్-2020 డాక్యుమెంట్‌ను విడుదల చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నాయుడు, “ఇది భారతదేశ దశాబ్దమని నిపుణులు అంటున్నారు, అయితే మేము దీనిని భారతదేశ శతాబ్దంగా మార్చాలి. ఇక P4 (పిపూల్, పబ్లిక్, ప్రైవేట్, పార్టెనర్‌షిప్‌) ప్రధాన వ్యూహంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. లక్ష్యాలను చేరుకోవడంలో జనాభా నిర్వహణ ప్రధాన పాత్ర పోషిస్తుంది. దేశంలో ఆధారపడిన జనాభా కంటే పని చేసే జనాభా ఎక్కువగా ఉందని గమనించిన మాజీ ముఖ్యమంత్రి, 15 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల సంపాదన జనాభా వేగంగా తగ్గుతోందని, ముఖ్యంగా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అదే వయస్సులో జనాభా ఉందని అన్నారు. బీహార్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ఈ సంఖ్య పెరుగుతోందన్నారు.

#ap-ex-cm-chandrababu #andhra-pradesh-cm-jagan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe