Konaseema: జీవితంలో గుర్తుండిపోయో పెళ్లి.. బుల్లెట్ బామలు, టూరింగ్ కారుపై ఊరేగింపు

పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు.. తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ.. మూడే ముళ్ళు.. ఏడే అడుగులు..మొత్తం కలిసీ నూరేళ్ళు... అంటూ..ఇటువంటి పెళ్లిళ్లను ఎప్పటినుంచో చూస్తున్నాం... వరుడు సినిమాలోలా..ఐదు రోజుల పెళ్లి అమ్మంటి పెళ్లీ...అంటూ..ఇటువంటి పెళ్లిళ్లను..చూసాం... కానీ...కోనసీమ జిల్లాలో కని విని ఎరుగని రీతిలో బుల్లెట్ బండి పాటకు దీటుగా.. బుల్లెట్ భామలతో.. అలనాటి తూరుంగ్ కారులో ఊరేగుతూ... పెళ్లి మండపానికి గుర్రపు బండిపై పెళ్లి కుమారుడు ... పల్లకిలో పెళ్లికూతురు మహారాణిలా.. కేరళ డప్పు వాయిద్యాలతో జీవితంలో గుర్తుండిపోయోలా జరిగింది ఒక ఇంట్లో పెళ్లిసందడి.

New Update
Konaseema: జీవితంలో గుర్తుండిపోయో పెళ్లి.. బుల్లెట్ బామలు, టూరింగ్ కారుపై ఊరేగింపు

Konaseema: ఏపీలో గోదారోళ్లంటేనే ఓ ప్రత్యేకత ఉంటుంది. వెటకారమైనా.. మమకారమైనా.. అభిమానమైనా.. ఆప్యాయతైనా.. మర్యాదలైనా.. గోదారోళ్ల గురించి చెప్పాలంటే.. అబ్బో.. అంటూ మొదలుపెడతారు. అల్లుళ్లకు, అత్తమామలకు, వియ్యంకులకు, బంధువులకు మర్యాదలు చేయాలంటే వారి తర్వాతే మరెవరైన. పెళ్లి భోజనం దగ్గర నుంచి.. అల్లుడికి ఆషాడం సారె పంపే వరకు కూడా ఓ ప్రత్యేకత చాటుతారు ఆ గోదారోళ్లు. ఇక, పెళ్లిళ్ల గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. దానికి ఉదాహరణే ఈ పెళ్లి..కోనసీమ ప్రకృతి అందాలకు హరివిల్లు ఆహ్లాదకరమైన పచ్చ పచ్చని పైర్లు, ఆకు పచ్చని కొబ్బరి చెట్లు.. వాటి చుట్టూ కాలువలు, అక్కడక్కడ అందమైన గోదావరీ నదీ.. పారే సెలయేర్లు, దానికి మించి గోదారోళ్ల వినూత్న పెళ్లిళ్ల సందడి అంతా ఇంతా కాదని చెప్పాలి. పంజాబీ వేషధారణలో మేళ తాళాలతో పెండ్లి కొడుకు, పెళ్లికూతురు ఊరేగుతుంటే.. మహారాష్ట్ర తరహాలో అమ్మాయిలు చీరకట్టులో బుల్లెట్ బైకులపై సందడి చేశారు.

Also Read: తిరుమలలో రెండు యాత్రికుల సముదాయాలు!

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా (Dr Br Ambedkar Konaseema District) రాజోలు మండలం రాజోలు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ కొడుకు కల్యాణ రిసెప్షన్ కన్నుల పండగను మించి ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. సుఖేష్, శ్రీ రంగనాయకి వినూత్న ఊరేగింపు, బాణాసంచాలు, పంజాబీ మేళాలు, తాళాలు, పెళ్ళి కొడుకు, కుమార్తె ఊరేగింపులు ఇలా ఒక్కటేమిటీ మాటల్లో చెప్పలేని వైవిధ్యంగా సాగింది. పెళ్లయితే మూడు రోజుల క్రితం పాలకొల్లులో జరిగింది. ఈ కళ్యాణ మండపానికి గుర్రపు బండిపై పెళ్లి కుమారుడు రాగా, పల్లకిలో పెళ్లికూతురని బోయీలు మోసుకుంటూ నర్సాపురం వీధుల్లో ఊరేగుతూ.. పెళ్లి మండపానికి చేరుకున్నారు.

ఇక అక్కడ పెళ్ళి తంతు అంతా మామూలే.. అయినప్పటికీ రిసెప్షన్ మాత్రం రాజోలులోని చాకలిపాలెం కంచర్ల శేఖర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. వరుడు -సుఖేష్ వధువు -శ్రీ రంగనాయకి. అన్నిటికి మించి బుల్లెట్ల బైకులపై మహారాష్ట్ర సంస్కృతిలో వస్త్రధారణ చేసిన యువతులు రథంపై పెళ్లి కొడుకు ఊరేగింపులు పల్లెవాసులను ఆశ్చర్యానికి గురిచేశాయి. కోనసీమ జిల్లాలో అంగరంగ వైభవంగా పెళ్లి చేయడం చూశాం కానీ.. ఈవిధంగా చేసిన ఇలాంటి వివాహం ఈమధ్య కాలంలో చూడలేదని స్థానికులు చెబుతున్నారు.

Also Read: మన్యంలో‌‌టెన్షన్..ఆచూకీ దొరకని హరి అనే ఏనుగు!

Advertisment
Advertisment
తాజా కథనాలు