Komatireddy Venkat Reddy: అలా జరిగితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. మంత్రి కోమటిరెడ్డి సవాల్!

TG: లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్​ పార్టీ రెండు సీట్లు గెలిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్‌ చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్గొండ జిల్లాకి గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. పదేళ్లు సీఎంగా రేవంత్​ కొనసాగుతారని ధీమా వ్యక్తం చేశారు.

TG News: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
New Update

Komatireddy Venkat Reddy: బీఆర్‌ఎస్‌పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్న మాజీ సీఎం కేసీఆర్‌, పార్లమెంట్‌ ఎన్నికల్లో కనీసం రెండు స్థానాల్లోనైనా గెలవాలని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్​ పార్టీ రెండు సీట్లు గెలిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్‌ చేశారు. నల్గొండ జిల్లాకి తీరని అన్యాయం గత ప్రభుత్వం చేసిందని మండిపడ్డారు. ఏం చెబుదామని మిర్యాలగూడకు వస్తున్నారని ప్రశ్నించారు.

హస్తం పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌ రెడ్డి నామినేషన్‌ ర్యాలీలో ఆయన పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ర్యాలీలో మంత్రులు ఉత్తమ్​ కుమార్​, మాజీ సీఎల్పీ జానారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్​ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో 5 అమలు చేసిందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. తాము రైతు రుణమాఫీ చేస్తే, బీఆర్ఎస్​ నాయకులు రాజీనామా చేస్తారా అని సవాలు విసిరారు. నల్గొండలో కాంగ్రెస్‌కు పోటీ లేదని అన్నారు.

పదేళ్లు ముఖ్యమంత్రిగా రేవంత్​ రెడ్డి కొనసాగుతారని ధీమా వ్యక్తం చేశారు. "లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్​ పార్టీ 2 ఎంపీ సీట్లు గెలుస్తుందా? కేసీఆర్‌ 2 ఎంపీ సీట్లు గెలిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా. కారు గ్యారేజ్‌కు పోయింది. నల్గొండకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మిర్యాలగూడకు కేసీఆర్​ వస్తున్నారు" అని మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పది సంవత్సరాల్లో కేసీఆర్ ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదని రేవంత్​ రెడ్డి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చారని కోమటిరెడ్డి అన్నారు.

#kcr #komatireddy-venkat-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe