మునుగోడు నుంచే పోటీ చేస్తా.. నా లక్ష్యం అదే: రాజగోపాల్‌ రెడ్డి!

సీఈసీలో తన పేరు పై చర్చించాలంటే కాంగ్రెస్ లో చేరాలనే నిబంధన ఉందని... అందుకే రాత్రికి రాత్రే పార్టీలో చేరినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్లు వివరించారు.

New Update
మునుగోడు నుంచే పోటీ చేస్తా.. నా లక్ష్యం అదే: రాజగోపాల్‌ రెడ్డి!

Komatireddy Rajgopal Reddy: మునుగోడు నుంచే పోటీ చేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బీజేపీ నుంచి సొంతగూటికి చేరుకున్నారు. ఒకరోజు ముందుగానే ఆయన ఢిల్లీలో కాంగ్రెస్‌ (Congress) కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.

సీఈసీలో తన పేరు పై చర్చించాలంటే కాంగ్రెస్ లో చేరాలనే నిబంధన ఉందని... అందుకే రాత్రికి రాత్రే పార్టీలో చేరినట్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్లు వివరించారు. అతి త్వరలోనే రాహుల్‌ గాంధీని (Rahul Gandhi) కూడా కలవనున్నట్లు వివరించారు.

Also Read: ఆ ఒక్క మాట వల్లే కొట్టాను.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే వివేకానంద..

తెలంగాణలో కేసీఆర్‌ని (KCR) గద్దె దించడమే ఏకైక లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే ధైర్యం ఒక్క కాంగ్రెస్‌ కే ఉందని ప్రజలు అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అందుకే కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు.

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమక్షంలో ఢిల్లీలో పార్టీ రాష్ట్ర ఇన్‌ ఛార్జ్‌ మాణిక్‌ రావు ఠాక్రే రాజగోపాల్‌ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన తరువాత ప్రధాన పార్టీల నేతల జంపింగ్‌ లు ప్రారంభం అయ్యాయి. గత కొంత కాలం క్రితం రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరి.. మునుగోడు నుంచి పోటీ చేశారు. కానీ విజయం సాధించలేకపోయారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో పరాజయం పొందిన తరువాత రాజగోపాల్‌ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో మళ్లీ తిరిగి ఆయన సొంతగూటికి చేరుకున్నారు. ఆయన శుక్రవారం రాహుల్‌ సమక్షంలో చేరాల్సి ఉన్నప్పటికీ సీఈసీ సమావేశం కంటే ముందే పార్టీ సభ్యత్వం ఉండాలన్న కారణంతో ఆయన గురువారం రాత్రే పార్టీలో చేరిపోయారు.

Advertisment
తాజా కథనాలు