Parvathy Thiruvothu : నటిని కాకపోయుంటే టీ అమ్మేదాన్ని.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

హీరోయిన్ పార్వతి తిరువొతూ తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఓ విలేకరి 'నటి కాకపోయి ఉంటే ఏమయ్యేవారని' ప్రశ్నించగా .. ఆమె బదులిస్తూ.." నటిని కాకపోతే ఖచ్చితంగా టీ షాపు పెట్టేదాన్ని. టీ చేయడంలో నాకు నైపుణ్యం ఉంది. టీ షాప్ పెట్టాలని చాలా కాలంగా ఉండేదని తెలిపింది.

New Update
Parvathy Thiruvothu : నటిని కాకపోయుంటే టీ అమ్మేదాన్ని.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Kollywwod Actress Parvathy Thiruvothu : కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘తంగలాన్’ (Thangalaan). 19వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'కబాలి' మూవీ ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాళవిక మోహన్, పార్వతి తిరువొతూ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్ విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది.

ట్రైలర్ లో విక్రమ్ విజువల్స్, యాక్షన్ సీక్వెన్సెస్ నెక్స్ట్ లెవెల్ లో కనిపించాయి. ఆగస్టు 15 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇద్దరు హీరోయిన్స్ తాజా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఇందులో ఓ విలేకరి 'నటి కాకపోయి ఉంటే ఏ రంగంలోకి అడుగుపెట్టేవారని' ప్రశ్నించాడు. అందుకు పార్వతి బదులిస్తూ.." నటిని కాకపోతే ఖచ్చితంగా టీ షాపు పెట్టేదాన్ని.

Also Read : పవన్ కళ్యాణ్‏తో అనసూయ స్టెప్పులు.. పాట మోత మోగిపోద్ది అంతే..!

వృత్తి ఏదైనా సరే మర్యాద, గౌరవంతో పనిచేయాలనుకున్నా. నాకు చిన్నప్పటి నుంచే టీ తాగడం చాలా ఇష్టం. టీ తయారు చేయడంలో కూడా నాకు నైపుణ్యం ఉంది. అందుకే నాకు టీ షాపు పెట్టాలనే ఆలోచన చాలా కాలంగా ఉంది" అని తెలిపింది. అనంతరం సినిమా గురించి మాట్లాడుతూ..' పా.రంజిత్‌ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. తంగలాన్‌ లో నాది గంగమ్మ అనే కీలక పాత్ర. ఈ పాత్ర కోసం ఎంతో శ్రమించా. భాషపరంగా కసరత్తు చేశా' అని తెలిపింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు