Suriya, Jyotika: ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న వారిలో సూర్య, జ్యోతిక ఒకరు. సినిమాలతో ఏర్పడిన వీరి స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఈ జంటకు ఇద్దరు సంతానం కూడా. ఇక ఈ జంట ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జ్యోతిక, సూర్య ఎక్కడ కనిపించిన హంగామా చేస్తారు. అంతే కాదు వీరిద్దరి బాడింగ్ చూసి తెగ ముచ్చటపడుతుంటారు ఫ్యాన్స్.
జిమ్ లో సూర్య, జ్యోతిక వర్కౌట్స్
అయితే తాజాగా ఈ స్టార్ కపుల్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తడం, పైలేట్ ఏసింగ్, లంజెస్ ఇతర కఠినమైన వ్యాయామాలు చేస్తూ కనిపించారు. ఈ వీడియోను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన జ్యోతిక.. డబుల్ స్వెట్, డబుల్ ఫన్ అంటూ క్యాప్షన్ జోడించారు. ఇది చూసిన కొందరు నెటిజన్లు కపుల్ గోల్స్ అంటూ కామెంట్స్ పెట్టగా.. మరి కొందరు అంత హెవీ వర్కౌట్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. తెర పై కనిపించే హీరోల ఫిట్ నెస్ వెనక ఇంత కష్టం ఉంటుందా అని అంటున్నారు.
ప్రస్తుతం సూర్య 'కంగువ' సినిమాతో బిజీగా ఉన్నారు. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'కంగువ' టీజర్, పోస్టర్ సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేశాయి. స్థూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా, వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. 2024 లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ 'కంగువ'. ఇక ఈ సినిమా కోసమే సూర్య జిమ్ లో కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.