Bigg Boss : బిగ్ బాస్ ఫ్యాన్స్ కు భారీ షాక్..హోస్టింగ్ నుంచి తప్పుకున్న స్టార్ హీరో..!

కమల్ హాసన్ తాత్కాలికంగా బిగ్ బాస్ తమిళ షో నుండి తప్పుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'ఏడేళ్ల క్రితం మొదలైన మా ప్రయాణంలో చిన్న విరామం. సినిమా కమిట్‌మెంట్స్ వల్ల రాబోయే బిగ్‌బాస్ సీజన్‌కి హోస్టింగ్ చేయట్లేదు' అని సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.

New Update
Bigg Boss : బిగ్ బాస్ ఫ్యాన్స్ కు భారీ షాక్..హోస్టింగ్ నుంచి తప్పుకున్న స్టార్ హీరో..!

Kollywood Senior Actor Kamal Haasan : కోలీవుడ్ సీనియర్ హీరో, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తాత్కాలికంగా బిగ్ బాస్ తమిళ షో నుండి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ఎక్స్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.." ఏడేళ్ల క్రితం మొదలైన మా ప్రయాణంలో చిన్న విరామం. సినిమా కమిట్‌మెంట్స్ వల్ల రాబోయే బిగ్‌బాస్ సీజన్‌కి హోస్టింగ్ చేయట్లేదు.

ఈ విషయాన్ని చాలా బాధతో చెబుతున్నా. ఈ షో ద్వారా ఇంటింటికీ చేరువైనందుకు నాకెంతో గర్వంగా ఉంది. మీరు నాపై ఎంతో ప్రేమ చూపించారు. అలా బిగ్ బాస్ తమిళ షోని భారతీయ టీవీ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బెస్ట్‌గా నిలిపారు. హోస్ట్‌గా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నా. ఈ క్రమంలోనే భాగమైన ప్రతిఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు" అని తన పోస్ట్ లో పేర్కొన్నారు.

Also Read : 8 ఏళ్లలో 26 సార్లు రీమేక్.. ఇప్పుడు హిందీలో ప్రేక్షకుల ముందుకు, ఆ సినిమా ఏంటో తెలుసా?

కాగా ఈ విషయం తెలిసి తమిళ బుల్లితెర ఆడియన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. కమల్ హాసన్ బిగ్ బాస్ షోకు వచ్చినప్పటి నుండి అద్భుతమైన హోస్టింగ్ తో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఆయన లేని ఖాళీని భర్తీ చేయడం చాలా కష్టమే అని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇక రీసెంట్ గా 'భారతీయుడు 2' సినిమాతో కమల్ ఆడియన్స్ ముందుకు వచ్చినవిషయం తెలిసిందే. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైంది. ప్రెజెంట్ ఈయన చేతిలో థగ్ లైఫ్, భారతీయుడు 3, కల్కి 2 వంటి సినిమాలున్నాయి.

Advertisment
తాజా కథనాలు