Kollywood Actor Vishal : మలయాళ ఇండస్ట్రీని హేమా కమిటీ రిపోర్ట్ కుదిపేస్తోంది. ఇప్పటికే ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, నటులపై ఆరోపణలు రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జస్టిస్ హేమా కమిటీ రెడీ చేసిన రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగు చూడటం సినిమా పరిశ్రమలోనే తీవ్ర పరిణామాలకు దారి తీసింది. కాగా ఈ కమిటీ రిపోర్ట్‌ను ఉద్దేశించి ఇప్పటికే పలువురు నటీనటులు తమ అభిప్రాయాలను బయటపెట్టారు.
Also Read : బాక్సాఫీస్ వద్ద ‘స్త్రీ 2’ జోరు.. ‘KGF 2’ రికార్డ్ బ్రేక్
ఇక తాజాగా తమిళ హీరో విశాల్ జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల సంరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. మహిళలను ఇబ్బందిపెట్టిన వారికి తగిన శిక్ష పడాలన్నారు. అంతేకాకుండా కోలీవుడ్‌లోనూ ఈవిధమైన కమిటీని ఏర్పాటుచేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈమేరకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు. 10 మంది సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటుచేసే ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు