Suriya : సూర్య మంచి మనసు.. ఫ్యాన్స్ తో కలిసి ఆ పని చేసిన హీరో, నెటిజన్ల ప్రశంసలు!

కోలీవుడ్ లో హీరో సూర్య మంచి మనసు చాటుకున్నాడు. తాజాగా ఆయన ఫ్యాన్స్ చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. అభిమానులతో పాటుగా ఆయన కూడా రక్తదానం చేశారు. ఈ విషయం తెలిసిన నెటిజన్స్ సూర్యతో పాటూ ఆయన ఫ్యాన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Suriya : సూర్య మంచి మనసు.. ఫ్యాన్స్ తో కలిసి ఆ పని చేసిన హీరో, నెటిజన్ల ప్రశంసలు!
New Update

Kollywood Actor Suriya Donated Blood : కోలీవుడ్ లో హీరో సూర్యకు భారీ అభిమాన గణం ఉంది. ఆయన బర్త్ డే వస్తుందంటే చాలు పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. సూర్య కూడా ఫ్యాన్స్ కు ఎలాంటి కష్టమొచ్చినా ముందే ఉంటారు. అయితే తాజాగా తన ఫ్యాన్స్ చేపట్టిన ఓ మంచి పనిలో సూర్య సైతం భాగమై మంచి మనసు చాటుకున్నాడు. జులై 23న సూర్య బర్త్ డే రాబోతుంది. ఈ క్రమంలోనే ఆయన ఫ్యాన్స్ ఎప్పటిలాగే పలు సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకొచ్చారు.

గతేడాది సూర్య పుట్టినరోజు సందర్భంగా సుమారు 2000 మంది అభిమానులు రక్తదానం చేశారు. ఆ విషయం తెలుసుకున్న సూర్య చలించిపోయారు. అప్పుడు 2024లో నిర్వహించే రక్తదాన శిబిరానికి తాను కూడా వస్తానని సూర్య అభిమానులకు మాటిచ్చారు. తాజాగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు ఈ కోలీవుడ్ హీరో. సూర్య తాజాగా చెన్నైలోని రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు.

Also Read : మరో టాలీవుడ్ ఆఫర్ అందుకున్న జాన్వీ కపూర్.. ఈసారి ఆ స్టార్ హీరోతో రొమాన్స్!

అభిమానులతో పాటుగా ఆయన కూడా రక్తదానం చేశారు. ఆయనతో పాటు సుమారు 500 మందికి పైగా అభిమానులు బ్లడ్‌ డొనేట్‌ చేశారు. అంతేకాదు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మరో పదిరోజుల పాటు జరగనుందని ఫ్యాన్స్ తెలిపారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో సూర్యతో పాటూ ఆయన ఫ్యాన్స్ పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

#suriya-donates-blood #actor-suriya
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe