SJ Surya : ఆ ఒక్క రీజన్ తో పవన్ కళ్యాణ్ 'ఖుషి 2' స్టోరీ రిజెక్ట్ చేశారు : SJ సూర్య

తమిళ నటుడు SJ సూర్య తాజా ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ 'ఖుషి 2' స్టోరీని రిజెక్ట్ చేసినట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ కి ఇంకో లవ్ స్టోరీ చెప్పాను. కథ ఆయనకు బాగా నచ్చింది. కానీ ఇప్పుడు పూర్తిగా లవ్ స్టోరీలు నాకు వర్కౌట్ అవ్వవని అన్నట్లు తెలిపారు.

New Update
SJ Surya : ఆ ఒక్క రీజన్ తో పవన్ కళ్యాణ్ 'ఖుషి 2' స్టోరీ రిజెక్ట్ చేశారు : SJ సూర్య

Kollywood Actor SJ Surya : న్యాచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో రూపొందుతున్న హైలీ ఎంటర్టైనర్ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో విలన్‌గా ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 29 న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్స్ తో తెగ బిజీగా ఉంది.

ముఖ్యంగా నాని, ప్రియాంకా మోహన్, ఎస్ జే సూర్య వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు.ఇందులో భాగంగానే తాజా ఇంటర్వ్యూలో SJ సూర్య 'ఖుషి 2' గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు." 'ఖుషి' తర్వాత పవన్ కళ్యాణ్ కి ఇంకో లవ్ స్టోరీ చెప్పాను. నేను అది 'ఖుషి 2' అనుకున్నా. ఆయనకు మాత్రం వేరే టైటిల్ చెప్పి కథ చెప్పాను. అది కూడా ఖుషి లాగే పూర్తి లవ్ స్టోరీ.

Also Read : రజినీకాంత్ ‘కూలీ’ లో బాలీవుడ్ స్టార్.. రోలెక్స్ పాత్రను మించి ప్లాన్ చేసిన డైరెక్టర్

కథ ఆయనకు బాగా నచ్చింది. కానీ ఇప్పుడు పూర్తిగా లవ్ స్టోరీలు నాకు వర్కౌట్ అవ్వవు అని అన్నారు. అందుకే ఆ కథ వద్దన్నారు పవన్ కళ్యాణ్. ఆ సినిమా చేసి ఉంటే మంచి హిట్ అయ్యేది. ఆయన్ని ఒప్పించడానికి నేను చాలా ట్రై చేశాను కానీ ఆయన వద్దన్నారు" అంటూ తెలిపారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు