Jayam Ravi : 'మేం విడిపోతున్నాం'.. స్టార్ హీరో సంచలన ప్రకటన, షాక్ లో ఫ్యాన్స్

తమిళ హీరో జయం రవి.. భార్యతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుపుతూ తన ఎక్స్ లో ఓ స్పెషల్ నోట్ రిలీజ్ చేశారు. ఎన్నో చర్చల తర్వాత నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యాం. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నాం అని పేర్కొన్నారు.

New Update
Jayam Ravi : 'మేం విడిపోతున్నాం'.. స్టార్ హీరో సంచలన ప్రకటన, షాక్ లో ఫ్యాన్స్

Kollywood Actor Jayam Ravi : ఈ మధ్య సినీ పరిశ్రమలో విడాకులు అనేవి కామం అయిపోయాయి. స్టార్ హీరో, హీరోయిన్స్ ఒక్కొక్కరిగా విడాకులు తీసుకుంటున్నారు. వారిలో కొందరు మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో డివోర్స్ తీసుకోగా.. మరికొందరు ఇతర రీజన్స్ తో విడిపోతున్నట్లు వెల్లడించారు. తాజాగా ఈ లిస్ట్ లో కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి సైతం చేరారు. ఆయన తన భార్యతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు.

ఈ విషయాన్ని తెలుపుతూ తన ఎక్స్ లో ఓ స్పెషల్ నోట్ రిలీజ్ చేశారు. అందులో.." ‘జీవితం ఎన్నో అధ్యాయాలతో నిండిన ప్రయాణం. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. మీలో చాలామంది నన్ను ఆదరించి నాకు మద్దతుగా నిలిచారు. అందుకే నేనెప్పుడు నా అభిమానులతో, మీడియాతో పారదర్శకంగా, నిజాయతీగా ఉంటాను. నేడు మీ అందరితో ఓ వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నా.


ఈ విషయాన్ని భారమైన హృదయంతో మీకు చెప్పాల్సి వస్తోంది. ఎన్నో ఆలోచనలు, చర్చల తర్వాత నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నాం. మాతో పాటు మా కుటుంబసభ్యుల గోప్యతను గౌరవించాలని మీ అందరినీ కోరుతున్నాను. ఈవిషయంపై రూమర్స్‌, ఆరోపణలు మానేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.

ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం. సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. మీ అందరికీ వినోదాన్ని పంచడం కోసం కష్టపడతాను. ఎప్పటికీ మీ జయం రవిగా మీ గుండెల్లో ఉంటా. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఎప్పటికీ ఇలానే మద్దతిస్తారని ఆశిస్తున్నా" అని పేర్కొన్నారు. జయం రవి విడాకుల వార్త విని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు