Dhanush : మరో హాలీవుడ్ ఆఫర్ అందుకున్న ధనుష్.. ఈసారి అతిపెద్ద ఫ్రాంచైజీలో!

కోలీవుడ్ స్టార్ ధనుష్ తాజాగా మరో హాలీవుడ్ ఆఫర్ అందుకున్నాడు. హాలీవుడ్‌లోని అతిపెద్ద ఫ్రాంచైజీలలో ఒకటైన అవెంజర్స్‌లో యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఐరన్ మ్యాన్ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ యాక్టర్ రోబర్ట్ డౌనీ జూనియర్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేయనున్నారు.

New Update
Dhanush : మరో హాలీవుడ్ ఆఫర్ అందుకున్న ధనుష్.. ఈసారి అతిపెద్ద ఫ్రాంచైజీలో!

Kollywood Actor Dhanush : తమిళ  స్టార్ ధనుష్ తాజాగా మరో హాలీవుడ్ ఆఫర్ అందుకున్నాడు. రూసో బ్రదర్స్‌ దర్శకత్వం వహించిన హాలీవుడ్‌ మూవీ ‘ది గ్రే మ్యాన్‌’ మూవీతో హాలీవుడ్ లో ఆరంగేట్రం చేసిన ఈ హీరో.. ఇప్పుడు అదే రూసో బ్రదర్స్‌ తెరకెక్కించబోయే అతిపెద్ద ఫ్రాంచైజీలలో ఒకటైన 'అవెంజర్స్‌' లో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఐరన్ మ్యాన్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రోబర్ట్ డౌనీ జూనియర్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేయనున్నారు.

ఈ వార్త ధనుష్ అభిమానులను ఎంతగానో ఉత్సాహపరిచింది. ఇప్పటికే తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో తనకంటూ ప్రేక్షకులను సొంతం చేసుకున్న ధనుష్, హాలీవుడ్ ఎంట్రీతో ప్రపంచవ్యాప్తంగా తన ఫ్యాన్ బేస్‌ను పెంచుకోవడం ఖాయం. అయితే, ఇందులో ధనుష్ పోషించే పాత్ర వివరాలు ఇంకా వెల్లడకాలేదు. అవెంజర్స్‌లో ఎలాంటి పాత్రలో కనిపించనున్నారనేది తెలియాలంటే అభిమానులు మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.

Also Read : డబుల్ ఇస్మార్ట్ కోసం నెల రోజుల్లోనే అన్ని కేజీలు తగ్గాను : రామ్ పోతినేని

ఈ అవకాశం ధనుష్ కెరీర్‌కు మరో మెట్టు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు మార్వెల్‌ ఫ్రాంచైజీలోని ‘అవెంజర్స్‌’ సిరీస్‌లో తర్వాతి చిత్రాలుగా ‘అవెంజర్స్‌: డూమ్స్‌ డే, అవెంజర్స్‌: సీక్రెట్‌ వార్‌’ రానున్నాయని, ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’ చిత్రానికి దర్శకత్వం వహించిన రూసో బ్రదర్స్‌ (ఆంథోనీ రూసో, జోసెఫ్‌ రూసో) ఈ చిత్రాలను తెరకెక్కించనున్నారు.

Advertisment
తాజా కథనాలు