Rape case: కోల్‌కతా జూనియర్ డాక్టర్ అభయ హత్యాచార ఘటనలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. నిందితుడు సంజయ్.. అభయపై అఘయిత్యానికి పాల్పడే ముందు రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లి వచ్చినట్లు విచారణలో తేలింది. ఓ పోలీస్ వాలంటీర్‌తో కలిసి అర్ధరాత్రి వ్యభిచార గృహానికి వెళ్లిన సంజయ్ రాయ్.. అక్కడినుంచి తెల్లవారుజామున నేరుగా కాలేజీ సెమినార్ హాల్లో పడుకున్న అభయ దగ్గరకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
మెడికల్ కాలేజీ అమ్మాయిలతో అసభ్య ప్రవర్తన..
అయితే అభయపై లైంగిక దాడి చేసి క్రూరంగా కొట్టి చంపిన సంజయ్.. ఒక ఉన్మాది వ్యవహరించాడు. డాక్టర్ రేప్ అండ్ మర్డర్ తర్వాత కనీసం అతనిలో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. ఉరితీస్తే తీసుకోండి అంటూ నిందితుడు అహంకారం చూపించాడని పోలీసు అధికారులు తెలిపారు. ఇక సంజయ్ రాయ్ ఫోన్ లోనూ నీలి చిత్రాలే ఎక్కువగా ఉన్నాయని, ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అమ్మాయిలతోనూ గతంలోనూ అసభ్యంగా ప్రవర్తించినట్లు సంజయ్‌రాయ్‌పై ఆరోపణలున్నట్లు తెలిపారు. వాలంటీర్‌గా పనిచేస్తూ పోలీస్‌నని చెప్పి దందాలకు కూడా పాల్పడ్డాడని, అతని వెనక పెద్ద తలకాయలున్నాయనే ధీమాతో ఇన్నాళ్లుగా రెచ్చిపోయి దుర్మార్గాలకు చేసినట్లు వెల్లడించారు. ఇక నిందితుడికి ఇప్పటికే 4 పెళ్లిలు కాగా.. ముగ్గురు భార్యలు విడాకాలు ఇచ్చేశారు. నాలుగో భార్య క్యాన్సర్‌తో చనిపోయింది.