Kolikapudi Srinivasa Rao: కృష్ణా జలాల సమస్యను పరిష్కరించకపోతే ఈ నెల 15 నుంచి నీటి సత్యాగ్రహ పాదయాత్ర చేస్తానన్నారు కొలికపూడి శ్రీనివాసరావు. ప్రజలు గొంతు ఎండిపోతుంది అని రోడ్లెక్కుతుంటే హడావిడిగా బ్రిడ్జి శంకుస్థాపన ఎందుకని ప్రశ్నించారు. ఏ కొండూరు మండలంలో ఏర్పడ్డ నీటి సమస్యను పరిష్కరించకపోతే మూడు రోజుల్లో నీటి సత్యాగ్రహం చేస్తానని తెలిపారు. చీమలపాడు గ్రామంలో కృష్ణా జిల్లాల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కొండూరు మండలం ప్రజలు గుప్పెట్టి నీటి కోసం నానా ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు వినగడప బ్రిడ్జి శంకుస్థాపన ఎందుకని ప్రశ్నించారు.
Also Read: అనపర్తిలో వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన 1000 మంది..!
నేటి నుంచి ప్రభుత్వానికి మూడు రోజులపాటు డెడ్ లైన్ విధిస్తున్నట్లు తెలిపారు. ఈ మూడు రోజుల్లో కృష్ణా జలాల నీటి సమస్యను పరిష్కరించకపోతే 15వ తేదీన ఏ కొండూరు అడ్డరోడ్డు నుంచి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ వరకు నీటి సత్యాగనం పేరిట పాదయాత్ర చేస్తానని శ్రీనివాసరావు తేల్చి చెప్పారు. రెడ్డిగూడెం మండలం కుదప కృష్ణా జలాల సంపు నుండి గత సంవత్సర కాలంగా టాక్టర్ ట్యాంకర్ల ద్వార కిడ్నీ రిహాబిలేషన్ ఏరియాకు నీటిని తోలుతున్నారని తెలిపారు. అయితే, కాంట్రాక్టర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన కోటి 20 లక్షల రూపాయల నిధులు ఇవ్వలేదని వెంటనే వారికి డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read: ఇవాళ్టి నుంచి డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ.. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవే!
టీడీపీ అధినేత చంద్రబాబు మాటే తనకు శిరోధార్యం అని కొలికపూడి అన్నారు. 175 నియోజకవర్గాల టీడీపీ సభ్యులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. అధికార పార్టీ వైసీపీకి ఓటమి తప్పదని టీడీపీ గెలుపు గ్యారెంటీ అని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కృష్ణా జలాల సమస్యకు కచ్చితంగా శాశ్వత పరిష్కారం దొరుకుతుందని వ్యాఖ్యానించారు.