తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

ప్రతి ఏటా నాలుగు సార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల సమయంలో వచ్చే మంగళవారం నిర్వహిస్తారు.‌ తిరుమంజనం కారణంగా అష్టదళపాదపద్మారాధన, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ప్రస్తుతం శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

New Update
తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Koil Alwar Thirumanjanam is scientifically known in Tirumala

 సంవత్సరంలో నాలుగు సార్లు

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించింది టీటీడీ. ఆణివార ఆస్థానం ఉండటంతో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఏటా నాలుగుసార్లు తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. ఆలయ శుద్ధిలో భాగంగా.. ఆనంద నిలయం నుంచి బంగారువాలికి వరకు శుభ్రం చేశారు. ఆ తర్వాత స్వామివారికి అర్చకులు పూజలు నిర్వహించగా.. అనంతరం భక్తుల్ని దర్శనానికి అనుమతించింది టీటీడీ.

Koil Alwar Thirumanjanam is scientifically known in Tirumala

ఆలయ శుద్ధి కార్యక్రమం

ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. తిరుమంజనం కారణంగా అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని నేడు విఐపీ దర్శనాలు కూడా టీటీడీ రద్దు చేసింది.

భక్తులను సర్వదర్శనం

ఆలయ శుద్ధి అనంతరం నామకోపు, గడ్డ కర్పూరం, గంధం పొడి, శ్రీచూర్ణం, కుంకుమ, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు వంటి సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. ఈ పరిమళాన్ని పూర్వీకులు ఎంతో కృషి చేసి వరంగా అందించారని చెబుతుంటారు. ఆలయంలో పరిమళం ప్రోక్షణం ద్వారా క్రిమికీటకాలు రాకుండా ఆలయం పరిశుభ్రంగా ఉంటుందని.. గోడలు పటిష్టంగా ఉంటాయి. తిరుమంజనం తర్వాత స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

త్వరలోనే బెంగళూరులో వైభవోత్సవాలు

అయితే త్వరలోనే బెంగళూరులో శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు నిర్వహించనున్నామని టీటీడీ జేఈవో తెలిపారు. వైభోత్సవాల నిర్వహణకు సంబంధించి ఆమె అధికారులు, నిర్వాహకులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలసి బసవన గుడి సమీపంలోని నేషనల్ కాలేజ్ గ్రౌండ్స్‌ను పరిశీలించారు. నేషనల్ కాలేజి గ్రౌండ్ సమీపంలో ఉన్న సత్య ప్రమోద, సత్య ప్రమోద అనెక్స్, వాసవి కన్వెన్షన్ హాల్‌ను అర్చకుల వసతి కోసం పరిశీలించారు. వాసవి కన్వెన్షన్ హాల్‌లో నిర్వాహకులు, అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు.

ఏర్పాట్లపై చర్చ

భక్తుల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై నిర్వాహకులు, అధికారులతో చర్చించారు. భక్తులు లోనికి రావడానికి, బయటకు వెళ్లడానికి ఏర్పాటు చేయాల్సిన మార్గాలు, పార్కింగ్, తాగు నీరు, సుమారు వేలాది మందికి సరిపడ సీటింగ్ ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అలాగే ఇంజనీరింగ్ పనులు, సంగీత ,సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ సేవల నిర్వహణపై అధికారులకు పలు సూచన చేశారు. ఐదు రోజులపాటు శ్రీవారి ఆలయంలో జరిగే నిత్య ,వార సేవలను యథాతథంగా నిర్వహించి బెంగళూరు నగరవాసులు వీటిని చూసి తరించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు ఆమె చెప్పారు. నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని జేఈవో తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు