/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Agamoktanga-Koil-Alwar-Thirumanjanam-in-Srivari-Temple-jpg.webp)
Koil Alwar Thirumanjanam in Tirumala:
సాలకట్ల బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని
కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. పుణ్యక్షేత్రంలో ఏటా నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబర్ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది.
విస్తృత ఏర్పాట్లు
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (TTD Chairman Bhumana Karunakar Reddy) మాట్లాడుతూ, శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రక్తంగా నిర్వహించినట్లు చైర్మన్ వివరించారు.
సంప్రదాయంగా శుద్ధి చేస్తారు
ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఆలయ శుద్ధి కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఆలయ అర్చకులు పాల్గొన్నారు. గుడిలో తిరుమల ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు.. శ్రీవారి ఆలయంలో ఉన్న ఉన్న గర్భాలయ, ఉప దేవాలయాలపై కప్పులతో పాటు ఆలయ ప్రాంగణం, గోడలతో సహా పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో సంప్రదాయంగా శుద్ధి చేస్తారు అర్చకులు.
సుగంధ ద్రవ్యాలతో..
ఈ ఆలయ శుద్ధి సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచుతారు ఆలయ అధికారులు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నీటితో శుద్ధి చేసిన తర్వల ఆలయ గోడలు, పైకప్పులపై పరిమళం అనే ప్రత్యేక సుగంధ మిశ్రమాన్ని పూస్తారు. ఈ సుగంధ మిశ్రమం.. కుంకుమ, నామకోపు, శ్రీచూర్ణం, గడ్డ కర్పూరం, గంధం పొడి, కస్తూరి పసుపు, పచ్చాకు, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలను కలగలిపి తయారు చేస్తారు.
Also Read: చంద్రబాబుకు రిమాండ్ తీర్పు ఇచ్చిన జస్టిస్ హిమ బిందు గురించి ఈ విషయాలు తెలుసా?