Kohli Record: ఆ ఘనత సాధించిన మూడోవాడిగా కొహ్లీ.. కివీస్ ను ఆడేసుకుంటున్న భారత్ 

న్యూజీలాండ్ తో జరుగుతున్న ప్రపంచకప్ మొదటి సెమీస్ లో భారత్ బ్యాటర్ల జోరు కొనసాగుతోంది. హాఫ్ సెంచరీతో గిల్ చెలరేగి పోతున్నాడు. మరోవైపు కోహ్లి నిలకడగా ఆడుతూ భారీ స్కోరు దిశగా కదులుతున్నాడు. 

New Update
Kohli Record: ఆ ఘనత సాధించిన మూడోవాడిగా కొహ్లీ.. కివీస్ ను ఆడేసుకుంటున్న భారత్ 

Kohli Record: ప్రపంచకప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని,  19 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 142 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ ఉన్నారు. వీరిద్దరి మధ్య 50 పరుగుల పార్ట్నర్ షిప్ పూర్తి అయింది.  

కొహ్లీ సూపర్ రికార్డ్:

వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. కోహ్లీ  ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్‌ను దాటాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌లో విరాట్ తన 28వ పరుగు తీసిన వెంటనే పాంటింగ్ రికార్డ్ దాటేశాడు.  పాంటింగ్ 375 వన్డేల్లో 13704 పరుగులు చేశాడు. కేవలం తన 291వ మ్యాచ్‌లో కోహ్లి ఈ రికార్డును బ్రేక్ చేశాడు.  శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర (14234 పరుగులు), భారత ఆటగాడు సచిన్ టెండూల్కర్ (18426 పరుగులు) మాత్రమే కోహ్లి కంటే ముందున్నారు.

ఈ ప్రపంచకప్‌లో గిల్ నాలుగో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని వన్డే కెరీర్‌లో ఇది ఆరో అర్ధ సెంచరీ. ప్రపంచకప్ సీజన్‌లో 600కి పైగా పరుగులు చేసిన భారత్ తరఫున మూడో బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ(Kohli Record) నిలిచాడు. గతంలో సచిన్ టెండూల్కర్ 2003లో, రోహిత్ శర్మ 2019లో ఈ ఘనత సాధించారు. అంతకుముందు 29 బంతుల్లో 47 పరుగులు చేసి కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. అతను కేన్ విలియమ్సన్ చేతిలో టిమ్ సౌథీకి క్యాచ్ ఇచ్చాడు. వన్డే పవర్‌ప్లేలో టిమ్ సౌతీ ఐదోసారి రోహిత్‌ను అవుట్ చేశాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ 50 బంతుల్లో 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

పవర్‌ప్లేలో 8.4 రన్ రేట్‌తో బ్యాటింగ్.. 

భారత్ వేగంగా ఆరంభించింది. తొలి 10 ఓవర్లలో 8.4 రన్ రేట్ తో బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ తొలి ఓవర్‌లోనే 10 పరుగులు చేసి న్యూజిలాండ్‌పై ఒత్తిడి పెంచారు.

ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీల షార్ట్ స్పెల్ 5 ఓవర్ల పాటు కొనసాగింది. దూకుడు బ్యాటింగ్‌ను చూసిన కెప్టెన్ విలియమ్సన్ ఆరో ఓవర్‌లో స్పిన్నర్ మిచెల్ సాంట్‌నర్‌ను తీసుకొచ్చాడు, సాంట్నర్ 11 పరుగుల ఓవర్ ఇచ్చాడు. షార్ట్ లెంగ్త్ బంతిని పుల్ చేయమని ట్రెంట్ బౌల్ట్ రోహిత్‌ను టెంప్ట్ చేశాడు.  కానీ రోహిత్ దానిని బౌండరీకి ​​మార్చాడు. 9వ ఓవర్లో టిమ్ సౌథీ బౌలింగ్ లో మరో  భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించి  రోహిత్ శర్మ వికెట్ కోల్పోయాడు. అతను 29 బంతుల్లో 47 పరుగుల ఇన్నింగ్స్ ఆడి గిల్‌తో కలిసి 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. పవర్‌ప్లేలో భారత్ స్కోరు బోర్డుకు 84 పరుగులు జోడించింది.

Also Read: రికార్డుల వేట షురూ చేసిన భారత్ 

భారత్-న్యూజిలాండ్ సెమీ-ఫైనల్ ఆసక్తికర విషయాలు.. 

ప్రపంచకప్‌లో ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ప్రస్తుత సీజన్‌లో 28 సిక్సర్లు కొట్టాడు. కరీబియన్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. 2015 ప్రపంచకప్‌లో గేల్ 26 సిక్సర్లు కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ 4 సిక్సర్లు బాదాడు. మూడో సిక్స్ కొట్టిన వెంటనే వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్‌లో రోహిత్ పేరిట 51 సిక్సర్లు ఉన్నాయి. వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ (49 సిక్సర్లు) రికార్డును బద్దలు కొట్టాడు. రోహిత్‌కి ఇది మూడో ప్రపంచకప్‌. దీనికి ముందు, అతను 2015 మరియు 2019 ODI ప్రపంచకప్‌లో కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.

ప్రపంచకప్‌లో పవర్‌ప్లేలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ ప్రపంచకప్ పవర్‌ప్లేలో అతను 19 సిక్సర్లు కొట్టాడు. కివీస్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ రికార్డును రోహిత్ వదిలేశాడు. 2015 ప్రపంచకప్‌లో పవర్‌ప్లే సమయంలో మెకల్లమ్ 17 సిక్సర్లు కొట్టాడు. 

ప్రస్తుత ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ సీజన్‌లో 28 సిక్సర్లు కొట్టాడు.  

Watch this Interesting Video:

Advertisment
తాజా కథనాలు