టీడీపీకి చురకలంటించిన కోడెల శివరామ్.. కారణం అదేనా?

దశాబ్దాలుగా పార్టీ అభివృద్ధికి కష్టపడిన వాళ్లకు నోటీసులివ్వడం ఏంటని కోడెల శివరామ్ ప్రశ్నించారు. చిలకలూరి పేట, నర్సారావు పేట, గురజాలలో చాలా మంది టికెట్స్ ఆశిస్తున్నారు. వాళ్లంతా నారా లోకేష్ ఎదుటే కొట్టుకున్నారు కూడా.. అలాంటి వారికి నోటీసులు ఇవ్వకుండా.. తనకు ఇవ్వడమేంటని ఫైర్ అయ్యారు. తెలుగు దేశం ఆఫీస్ ప్రారంభించినప్పటి నుంచి కన్నా లక్ష్మీ నారాయణ ఒక్కసారి కూడా అందులోకి వెళ్లనే లేదు. ఆయనకు నోటీసులివ్వకుండా..

టీడీపీకి చురకలంటించిన కోడెల శివరామ్.. కారణం అదేనా?
New Update

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీట్ ఎక్కాయి. ఎన్నికల్ దగ్గర పడే కొద్ది అసంతృప్తి నేతలు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీలో నోటీసులు కలకలం రేపుతున్నాయి. కన్నా లక్ష్మీ నారాయణ ఇన్ చార్జ్ గా బాధ్యతలు చేపట్టాక.. పార్టీ కార్యక్రమాల్లో కోడెల శివరామ్ ఆయన వర్గీయులు యాక్టీవ్ గా లేరని, దీనికి కారణాలు చెప్పాలంటూ మంగళవారం 16 మందికి హై కమాండ్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులతో కోడెల శివరామ్ వర్గీయలులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. నిన్నమొన్నటిదాకా ప్రశాంతంగా ఉన్న సత్తెనపల్లి టీడీపీలో ఇప్పుడు ఈ నోటీసులు అగ్గిని రాజేశాయి. తాజాగా ఈ నోటీసులపై రియాక్ట్ అయిన కోడెల శివరామ్.. టీడీపీ అధిష్టానానికి కౌంటర్లు వేశారు.

సత్తెనపల్లి టీడీపీ ఇన్ చార్జ్ గా కన్నా లక్ష్మీ నారాయణను నియమించడంతో ఈ రగడ మొదలైంది. అప్పటి నుంచి ఆగ్రహంతో రగిలిపోతున్న కోడెల శివరామ్.. తాజాగా పంపిన నోటీసులతో తెలుగుదేశం అధిష్టానంపై మరింత ఆగ్రహం వెళ్లగక్కారు. అప్పట్లోనే టీడీపీ ఆత్మీయ సమ్మెళనాలతో కూడా హీట్ పుట్టించారు. అంతటితో ఆగకుండా ఇంటింటికి వెళ్లి ప్రజల్ని పలకరించే ప్రయత్నం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అండగా ఉంటాననన్నారు. ఆయన ఇంతలా తమ ఆవేదనను బటయ పెడుతున్నా.. చంద్రబాబు మాత్రం సైలెంట్ గా ఉండటంతో శివరామ్ మరింత మండిపడుతున్నారు.

మరోవైపు శివరామ్‌ ఇంటికెళ్లి తెలుగుదేశం పెద్దలు చర్చలు కూడా జరిపారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు.. అధిష్టానం నోటీసులివ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దశాబ్దాలుగా పార్టీ అభివృద్ధికి కష్టపడిన వాళ్లకు నోటీసులివ్వడం ఏంటని కోడెల శివరామ్ ప్రశ్నించారు. చిలకలూరి పేట, నర్సారావు పేట, గురజాలలో చాలా మంది టికెట్స్ ఆశిస్తున్నారు. వాళ్లంతా నారా లోకేష్ ఎదుటే కొట్టుకున్నారు కూడా.. అలాంటి వారికి నోటీసులు ఇవ్వకుండా.. తనకు ఇవ్వడమేంటని ఫైర్ అయ్యారు.

తెలుగు దేశం ఆఫీస్ ప్రారంభించినప్పటి నుంచి కన్నా లక్ష్మీ నారాయణ ఒక్కసారి కూడా అందులోకి వెళ్లనే లేదు. ఆయనకు నోటీసులివ్వకుండా తనకు ఇవ్వడంలో మతలబు ఏంటో తేల్చాలని కోడెల శివరామ్ నిలదీశారు. మరి శివరామ్ కామెంట్స్ పై టీడీపీ హైకమాండ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. కాగా మొన్నటిదాకా సత్తెనపల్లి టీడీపీ0 ప్రశాంతంగా ఉంది. అయితే కోడెల శివరామ్ కి నోటీసులివ్వడంతో ఆయన వర్గీయులు ఉలిక్కి పడ్డారు. మరి శివరామ్ అండ్‌ కో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారా? కన్నా లక్ష్మినారాయణకు సహకరిస్తారా? ఒకవేళ సహకరించకుంటే అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది.

#tdp #notices #hot-comments #high-command #kodela-sivaram #tdp-leader-kodela-sivaram
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe