Kodali Nani: పీకేను పూర్తిగా వాడేశాం.. ఆయన బుర్రలో గుజ్జంతా ఖాళీ: కొడాలి నాని సెటైర్లు

'బీహార్ నుంచి వచ్చిన ప్రశాంత్ ఇప్పుడు ఏం పీకుతాడు తమ్ముళ్లూ'.. అని గతంలో అన్న చంద్రబాబు ఇప్పుడు ఏం పీకడానికి భేటీ అయ్యాడో చెప్పాలని మాజీ మంత్రి కొడాలి నాని డిమాండ్ చేశారు. ప్రశాంత్ కిశోర్ కు ఐప్యాక్ కు ప్రస్తుతం సంబంధం లేదన్నారు.

New Update
Kodali Nani: పీకేను పూర్తిగా వాడేశాం.. ఆయన బుర్రలో గుజ్జంతా ఖాళీ: కొడాలి నాని సెటైర్లు

చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore) నిన్న భేటీ కావడంపై ఏపీలో మొదలైన రాజకీయ ప్రకంపనలు ఇంకా ఆగడం లేదు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విషయంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) తన స్టైల్లో తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ఎంతమంది పీకేలను పెట్టుకున్నా.. సీఎం జగన్ ను పికేదేం ఉండదన్నారు. చంద్రబాబు అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అని సీఎం జగన్, తాము రోజూ చెబుతూనే ఉన్నామని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ను వారు కలిస్తే భూమి బద్దలై పోతుందా? అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: CM Jagan: వైసీపీలో చిచ్చు పెట్టిన రేవంత్.. ఎంపీలపై సీఎం జగన్ సీరియస్

ప్రశాంత్ కిషోర్ ను తాము పూర్తిగా వాడేశామని.. ఆయన బుర్రలో గుజ్జంతా అయిపోయిందన్నారు. మా వ్యూహకర్తగా ఉన్నప్పుడు 'బీహార్ నుంచి వచ్చిన ప్రశాంత్ ఇప్పుడు ఏం పీకుతాడు తమ్ముళ్లూ'.. అన్న చంద్రబాబు ఇప్పుడు ఏం పీకడానికి భేటీ అయ్యాడో పసుపు తమ్ముళ్లకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రశాంత్ సూచనలతో బాబాయ్ ని చంపి, జగన్ కోడి కత్తి డ్రామాలు అడారని అప్పట్లో ఎల్లో మీడియా గగ్గోలు పెట్టిందన్నారు.
ఇది కూడా చదవండి: AP Free Bus Scheme : ఏపీ మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త.. న్యూ ఇయర్ నుంచే బస్సుల్లో ఫ్రీ జర్నీ?

మరి ఇప్పుడు చంద్రబాబు పీక కోయించుకుంటాడానికి.. లోకేష్ తండ్రిని చంపడానికి ప్లాన్ వేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ కు, ఐప్యాక్ కు సంబంధం లేదన్నారు. ఇండియా కూటమిలో చేరమని సీఎం మమతా బెనర్జీ పంపితే ప్రశాంత్ కిషోర్ వచ్చారని ఆరోపించారు చేశారు కొడాలి నాని. పాట్నర్ పీకే బీజేపీతో చర్చలు జరుపుతుంటే.. మరో పీకే ఇండియ కూటమి, మమతా బెనర్జీ, కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఇంకా కొనసాగిస్తున్నాడని వ్యంగ్యాస్త్రాలు విసిరారు కొడాలి నాని.

Advertisment
Advertisment
తాజా కథనాలు