తెలుగు దేశం పార్టీ అధినేత(TDP) చంద్రబాబు(Chandrababu naidu) మీద గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) మరోసారి నోరు పారేసుకున్నారు. చంద్రబాబుకు ఇటీవల ఐటీ శాఖ( IT) చంద్రబాబుకి నోటీసులు ఇచ్చిన క్రమంలో ఆయన సమాధానం చెప్పాలని అన్నారు. తాజాగా ఆయన బాబు మీద విమర్శల దాడి పెంచారు.
సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన బాబు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలోనే అత్యంత అవినీతి పరుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం చంద్రబాబు మాత్రమే అని ఆయన ధ్వజమెత్తారు. ఆయనకు సింగపూర్ వంటి దేశంలో ఆయనకు హోటళ్లు ఉన్నాయని..అవి ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు. చట్టాలను అడ్డు పెట్టుకొని టీడీపీ హయాంల చంద్రబాబు దోచుకున్నారని కొడాలి నాని ఆరోపించారు.
ఎన్నికల్లో డబ్బు పంపిణీ నేర్పించిందే కొడాలి నాని అన్నారు. 2014 ఎన్నికల సమయంలో ఆయన పంచిన డబ్బు వల్లే జగన్ ఓడిపోయారు..లేకపోయుంటే జగన్ అప్పుడే గెలిచివారు అన్నారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే గెలిచి అధికారంలోకి రాలేదా అని నిలదీశారు. ఈసారి కూడా ఒంటరిగానే నిలుస్తాం..గెలిచి చూపిస్తామని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో 5,10,20, 30 కోట్ల రూపాయలు చొప్పున అభ్యర్థులకు ఇచ్చారని పదివేల కోట్ల రూపాయలు తన పార్టీ అభ్యర్థులకు బాబు ఇచ్చాడనేది నిజమా..కాదా అంటూ నిలదీశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న కమీషన్లే కాదా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు ఐటీ నోటీసులు ఇచ్చిన 118 కోట్లు అనేది చాలా తక్కువ మొత్తం. ఇది రికార్డుగా దొరికిన డబ్బు మాత్రమే.. లక్ష కోట్లకు వరకు దోచుకున్నాడని ఆరోపించారు.
ఈ చట్టాలు, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎలా చేయాలో చంద్రబాబుకు బాగా తెలుసన్నారు. జగన్ 2014 లో ఓడిపోయారని ఎవరినైనా కలిశారా...ఒంటరిగా పోటీ చేయలేదా అని ప్రశ్నించారు. వైయస్ రాజశేఖరరెడ్డిది ఏమైనా పేద కుటుంబమా ఇన్ కం ట్యాక్స్ మేనేజ్ చేసి, బీజేపీ, మోడీ కాపాడినా...రాష్ట్ర ప్రజల నుంచి చంద్రబాబు తప్పించుకోలేడని కొడాలి నాని విమర్శించారు.